ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిత్రం : బంగారు కానుక
సంగీతం : సత్యం
గానం : బాలు - జానకి
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
మణిపురిలో వయ్యారమా
పురివిప్పిన మయూరమా
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
శృతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
హిమగిరికాసరిఝరి వాహినిలో
అలరేగిన సితవర్ణ తురంగమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హిమకరకర మహిమాన్విత నిశీధిలో
చెలరేగిన చేకోరిక విహంగామా
పరువాల పతంగమా
హృదయాల మృదంగమా
వసంత పంచమ సుస్వరమా
వార్షుకాభ్రసడ్జమ నిస్వనమా
స గారి. సరిసని. . పా నిసరి
స స ! ప ప ! ప ప ప ప ! గపగరిస !!
నడకా...... హంసధ్వని రాగమా....
నడకే హంసధ్వని రాగామే
కాశ్మీరమందార కుసుమంలో
మధువులైన పెదవుల మకరందామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి కౌగిలింతలలో
కదలి పొంగు కడలీతరంగమా
నా జీవన దాహమా నా జవ్వన మొహమా
అరుణచరణ యుగ చారణమా
మధురగతుల మదవారణమా
సరి! సరి ! ప గ ద ప! గప! నిప ! నిసరి !!
నిస! గరి ! సరి ! స ని గ ప ! గరిస !!
నడకా...... హంసధ్వని రాగమా....
నడకే హంసధ్వని రాగామే
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా మానస సరోవరస్థీరంలో
కలికి నెలలు చిలికే కల్హారమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలహంసలు కలలు కన్న స్వప్నంలో
హింసపడిన హంసల నయగారమా
నడకే ఒక నాట్యమా
నడకే ఒక నాట్యమా
నామృగేంద్రమధ్యమా
శరత్వేణురవరంజితమా
శరదంబరచెంచల సంచితమా
తకున్దరి తకఝను
తకున్దరి తకఝను
తధిగిన తొం తకిట తొం తక తొం త
నడకా హంసధ్వని రాగమా
ఆది నడుమా గగనంలో కుసుమమా
మణిపురిలో వయ్యారమా
పురివిప్పిన మయూరమా
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
శృతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే
నడకే హంసధ్వని రాగామే
అది నడుమే గగనంలో కుసుమమే
No comments:
Post a Comment