జై శ్రీమన్నారాయణ
రాగం : మోహన
పాడినవిధానం : స్వప్న
సంగీతం : నిహాల్
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమలగర్భ గౌరి
లక్ష్మిప్రసీద సతతం నమతాం శరణ్యే
పైన చెప్పిన లక్ష్మి అష్టోత్తరసాతానామస్తోత్రం లోని శ్లోకమే ఈ కీర్తన.
సత్యభామ సరసపు నగవు .... ఆ. ఆ.. ఆ...ఆ
సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవాయ
సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవాయ
సత్యభామ సరసపు నగవు .... ఆ. ఆ.. ఆ...ఆ
సత్యభామ సరసపు నగవు .... ఆ. ఆ.. ఆ...ఆ
శ్రీ మహాలక్ష్మి త్రిగుణాకారయై రుక్మిణి సత్యభాములు తానే అయి, అలమేల్మంగా కృతియై అలరినది, సత్యభామాదేవి సరసపు సెలవినవ్వు స్వామి మనస్సులో హత్తుకొని నిత్యనూతనంగా విరాజిల్లుతున్నది.
రుకుమిణి దేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
రుకుమిణి దేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమున చెదరిన అలకల
చికురాంబరమున చెదరిన అలకల
వికచాబ్జ ముఖము వేయి వేలాయె
చికురాంబరమున చెదరిన అలకల
వికచాబ్జ ముఖము వేయి వేలాయె
చికురాంబరమున చెదరిన అలకల
వికచాబ్జ ముఖము వేయి వేలాయె
సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవాయ
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
రుక్మిణీదేవికి నిత్యా యవ్వన రూప సౌందర్య వైభవ సర్వస్వస్నిగ్ధతతో వికసించిన ఆమె ముఖ కమలం, చెదిరిన ఆమె తురుములోని అలకలలో దోబూచులాడుతున్నందున తద్వదన కమలపునః పునర్దర్శనంవలన దశ గణిత శత సహస్ర కామలోదయం స్వామి అలంకరింపుకై కలిగినదిట.
తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై
నడపులమురిపెపు నగుమోము
తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై
నడపులమురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ
సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవాయ
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
అనునిత్యం ఈ అలమేల్మంగ కనుబొమవింటి వంపుల అతిశయం (సత్యభామగా, రుక్మిణిగా, శ్రీ లక్ష్మి గా స్వామి కి అలరింపులొనర్చి తానలరినందున గల్గిన అతిశయం వలన ఆమె కనుబొమలు పైకి లేచినవి అని చమత్కారం ) శ్రీవేంకటపతికి దినదినపు చనవుల సొబగుల సంపదలైనవి అని అన్నమాచార్యలు అంటున్నారు.
అనుదినమును నీ అలమేలుమంగ
కనుగవ జంకెన గర్వములు
అనుదినమును నీ అలమేలుమంగ
కనుగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి..... ఈ ఈ ఈ ఈ
దినదినంబులును తిరువేంకటపతి
చనవుల సొబగుల సంపదలాయ
దినదినంబులును తిరువేంకటపతి
చనవుల సొబగుల సంపదలాయ
సత్యభామ సరసపు నగవు ....
నిత్యము హరి మదినే నెలవాయ
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
సత్యభామ సరసపు నగవు ....ఉ... ఉ... ఉ...
No comments:
Post a Comment