Saturday, July 25, 2020

నగవులు నిజమని నమ్మేదా

జై శ్రీమన్నారాయణ
రాగం : యమన్ కల్యాణి
సంపుటి 4, సంకీర్తన 353
పాడినవిధానం : సైన్ధవి (Fusion)

ఓ మనసా పైకి కనిపించే దొంగ  నవ్వులన్నీ నిజమని  ఎట్లా నమ్మడం!  పైపై మెరుగులన్నీ ఆశలకు దారి కల్పించేవే కదా! ఈ ఆశలను వద్దనవే ఓ మనసా! ముందటి జన్మలతో చేసిన కర్మము దొంతరలు వలే పేరుకుపోయి ఉండగా, మళ్ళి  కొత్త కర్మ చేయడమా? భవసాగరంలో మునగడమా! పవిత్రమైన నీ నామము నా నాలుకపై నుండగా ఇతరాలను తలచేది ఎందుకు తండ్రి! నీవే నా సర్వము, నన్ను ఈ మాయా వల నుండి విడిపించుము తండ్రి!

అర్ధాలు
నగవు = నవ్వు ( ఈపాటలో బాహ్యానికి అందంగా కనిపించేవని అర్ధం చెప్పుకోవాలి.
దొంతులు = దొంతరలు
తడవేదా = స్పృశించేదా (పలికేదా)
చెంచలము = చలనము (నిలకడ  లేని)


నగవులు నిజమని నమ్మేదా
నగవులు నిజమని నమ్మేదా
నగవులు నిజమని నమ్మేదా
వొగినడియాసలు వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా
వొగినడియాసలు వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా......

తొల్లిటి కర్మము దొంతుల నుండగ
తొల్లిటి కర్మము దొంతుల నుండగ
తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లబోయిక  చేసేదా
యెల్ల లోకములు యేలేటి దేవుడ
యెల్ల లోకములు యేలేటి దేవుడ
వొల్ల నొల్లనిక వొద్దనవే
వొల్ల నొల్లనిక వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా
వొగినడియాసలు వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా......


నలి నీనామము నాలికనుండగ
నలి నీనామము నాలికనుండగ
నలి నీనామము నాలికనుండగ
తలకొని యితరము తడవేదా
బలు శ్రీ వేంకటపతి నిన్నుకొలిచి
బలు శ్రీ వేంకటపతి నిన్నుకొలిచి
వొలుకు చెంచలము వొద్దనవే
వొలుకు చెంచలము వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా
వొగినడియాసలు వొద్దనవే
నగవులు నిజమని నమ్మేదా
వొగినడియాసలు వొద్దనవే 
నగవులు నిజమని నమ్మేదా......





No comments:

Post a Comment