Saturday, February 25, 2017

అతివలు అంటే అలుసా నీకు

నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మకి, అమ్మ తరువాత అమ్మలా నన్ను చూసిన అక్కకి, వీరువురిని ఒక్క రూపాన చూపిన నా భార్యకి, నన్ను ప్రశంసించి, ప్రేరేపించి, నన్ను నాకు పరిచయం చేసిన ఎందరు స్త్రీ మూర్తులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ ప్రపంచ మహిళా దినోత్సవ శుభసందర్భముగా వారి కోసం, ఎందరో అమ్మలకోసం నేను రాసుకున్న ఈ ప్రయత్నం మీకోసం. తప్పులుంటే క్షమించండి. మార్పులు చేర్పులు తెలియచేయండి.

మరొక సారి అందరి తల్లులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ కళ మీ చలవ నాన్నగారు

అతివలు అంటే అలుసా నీకు
అణిచే గుణమే పోదా నీకు

మగువలు అంటే తగవెందులకు
మృగముగ మారుట తగునా నీకు

తనువులు ఒకటై మనలో సగమై
మనరూపంబును కడుపున మోసీ
మరుజన్మెత్తీ భూమికి తెచ్చే  
తీరని ఋణమే వరమౌ కాదా "2"                      అతివలు అంటే అలుసా నీకు


ఆలన పాలన అన్నీ తానై పెంచే మొక్కను తుంచేవా
అలుపు సోలుపు ఎరుగని అమ్మలు మనలో ఒకరని  మరచేవా
కళలకు కాణాచి  నడతకు నెలవు
విలువల మాగాణి సిరులకి తరువు
తొలి గురువనునది మరిచేవా
తొందరపాటును చూపేవా  "2"                          అతివలు అంటే అలుసా నీకు



పగలు రేయి తేడా లేక శ్రమనే నమ్మే గుణవతిరా
ఇంటా బయటా ఒర్పుల నేర్పుతొ విజయ పధాన సాగెనురా
శెలవులు లేని జీతం రాని
పదవులు లేని పరపతి కొరని
మహనీయతనే మరచెదవా
దురహంకారము చూపెదవా  "2".                         అతివలు అంటే అలుసా నీకు






No comments:

Post a Comment