Monday, July 20, 2020

ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల

జై శ్రీమన్నారాయణ 

రాగం : ఆరభి 
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 

ఏమని వర్ణించాయి ఈ పురాణాలన్నీ ప్రతి సారి కొత్తగా కనిపిస్తున్నాడు ఈ విశ్వలోకాలకధిపతి అంటున్నారు అన్నమయ్య 

ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి

పాలసముద్రంలో ఉంటాడు కదా ఆ శ్రీమహావిష్ణువు, అక్కడ ఉండి ఉండి  ఆ నీలవర్ణుడు కాస్తా తెల్లబడినాడంట, పోలిక వేరేగా ఉందికదా అల్లా ఎందుకు అన్నారంటే శ్రేష్ఠమైన కర్పూరంతో ఆ స్వామి శరీరం కప్పితే అలానే ఉందిట. 

పాలజలనిధిలోన పలుమారు తేలగాను
పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి


స్వామికి పునుగుపిల్లి తైలాన్ని ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత రాస్తారు, అది వంటి నొప్పులు తగ్గింస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ చరణం లో కాళింది మడుగున పలుమార్లు ఈతలాడిన వాడు కమ్మరి నలుపట, ఆ పునుగుపిల్లి తైలాన్ని రాయడం వల్ల ఆ సరేశ్వరుని రూపే మారిందిట. 



వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి


అలమేలుమంగమ్మ  హృదయమందు ఉంటుంది కదా అందువల్ల ఆమె బంగారు రంగు కాస్త స్వామికి సోకిందట, ఇల్లా నాలుగు రంగులు తోడై ఆ శ్రీయః పతి ఉన్నాడట. 

అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి


No comments:

Post a Comment