Monday, June 1, 2015

chinni chinni kannyyaa..

మిత్రులకి శుభోదయం

ఈ రోజు నాలాంటి వారికి ఒక పండుగ, సంగీత అభిమానులకి ఈ రోజు ఒక సుదినం, ఎందుకంటే "ఇసై" రాజా జన్మదినం.

17 సంవత్సరాల క్రితం ఊరువిడిచి, అమ్మా నాన్నగార్లని అందరిని విడిచి దూరంగా ఒక్కడిని ఉద్యోగరీచ్యా  కర్ణాటక వెళ్ళిన నాకు,  ఎల్లప్పుడూ తోడువున్నది ఇళయరాజా గారి పాటలే అంటా. అమ్మ గుర్తుకు వచ్చినా, నాన్నగారు గుర్తుకొచ్చినా, అక్కా, అన్నా, ఊరు వాడా ఏది గుర్తొచ్చినా వాళ్ళందరిని మరిచిపోయి మాములుగా కావడానికి కేవలం ఇళయరాజా గారి పాటలే కారణం. తమిళనాట నుంచి వచ్చిన సహుద్యోగుల వలన రాజా గారి ఎన్నో తమిళ ఆణిముత్యాలు పరిచయం అయ్యాయి, మౌనరాగం, కాదల్ ఓవియం, అళగల్ ఓవియం, బద్రకాళీ, భారతి, ధర్మపత్ని, లాంటి ఎన్నో చిత్రాలలో పాటలు పరిచయం అయ్యాయి. వారందరికీ మనఃపూర్వక దన్యవాదములు.

@jayakrishna  చెప్పినట్టు There are only two types of IR fans: 1. Who believe that he is god 2. Who can never disagree with above belief. Ilaiyaraja \m/

అక్షరాలా నిజం అయినని అయిన పాటల్ని అభిమానించని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. "హి ఇజ్ గాడ్ అఫ్ మ్యూజిక్"

ఎడుపోచ్చినా, కోపమొచ్చినా, బాధా, బయం ఏమొచ్చినా వాటిని పరిచిపోవడానికి ఔషదమ్ ఇళయరాజా సంగీతం.

మీరు మీ పాటలు  కలకాలం, చిరకాలం ఈ జగతిలో ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నా.

రాజా గారు సినిమా ఫీల్డ్ కి వచ్చిన కొత్తల్లో చేసిన ఈ పాట మీకోసం, నాకు చాలా ఇష్టం, భద్రకాళి చిత్రంలోని "చిన్ని చిన్ని కన్నయ్యా" పాట. 1976 డిసెంబర్లో తమిళంలోనూ, 1977 జనవరి లో తెలుగులోనూ వచ్చింది ఈ చిత్రం.

దాశరధి కేగారు రాసిన ఈ జోల పాట ఎంతో శ్రావ్యంగా  జేసుదాసు గారు సుశీలమ్మ పాడారు. జయప్రద నటన చాలా బాగుంటుంది ఈ సినిమాలో,



చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను
ఎత్తుకొని ముద్దాడి ఉయ్యలలూపేను
జోల పాట పాడేను లాలి పాట పాడేను

నీ ఒడిలో నిదురించి తీయని కలగాంచి
పొంగి పొంగి పోయాను పుణ్యమెంతో చేసాను
ఏడేడు జన్మలకు నాతోడు నీవమ్మా ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా 
అమ్మవలె రమ్మనగా పాప వలె  చేరేవు
నాచెంత  నీవుంటే స్వర్గమే నాదవును
గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే
కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే

స్నానమాడే శుభవేళ కురులలో పువ్వులతో
దేవి వలె  నీవస్తే  నా మనసు నిలువదులే
అందాల కన్నులకు కాటుకను దిద్దేను
చెడు చూపు పడకుండా అగరు చుక్క పెట్టేను

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను
ఎత్తుకొని ముద్దాడి ఉయ్యలలూపేను
జోల పాట పాడేను లాలి పాట పాడేను




https://www.youtube.com/watch?v=meT2fPnE6hU

No comments:

Post a Comment