మిత్రులకి వందనం
ఆర్తీ అగర్వాల్ చిన్న వయసులోనే మనల్ని విడిచి పరలోకాలకి వెళ్ళడం బాధాకరమే, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రాద్ధిస్తున్నా.
చాల మంచి చిత్రాలని చేసారు, అన్నిటికన్నా వెంకటేష్ గారితో చేసిన నువ్వు నాకు నచ్చావ్ బాగుంటుంది. అందులో ఆకాశం దిగివచ్చి అనే పెళ్ళి పాట అంటే చాలా ఇష్టం, శాస్త్రి గారు అధ్బుతంగా రాసారు. ఈ రోజు మీకోసం
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇళ్ళ మావిళ్ళ తోరణలన్ని పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
ఆకాశం దిగి వచ్చి మబ్బులుతో వెయ్యాలి మన పందిరి
చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గుదొంతరలు
ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ఓ ఓ
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల
కులుకల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా
విన్న వారేవరసలు సన్నాయి వారి సంగతులు
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చక చక ఆడే జూద సిఖామణులు ఉ ఉ
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ
ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా
https://www.youtube.com/watch?v=srVdSnJ-oUs

No comments:
Post a Comment