Monday, June 29, 2015

godaavari paiyedaa

మిత్రులకి వందనం

రవి శంకర్ శర్మ గారు 50s నుంచి 80s  వరకు హిందీలో మంచి చిత్రాలకి మ్యూజిక్ అందించారు, కొంత గ్యాప్ తరువాత మలయాళం లో కొన్ని చిత్రాలు చేసారు, మలయాళం లో పేరు మార్చుకొని బొంబాయి రవి గా కొనసాగారు, తెలుగులో కేవలం సరిగమలు అనే చిత్రం చేసారు, ఆయినే సంగీతం అందించడానికి కారణం ఆ చిత్రానికి మలయాళం మాతృక కావడమే.

అశ్వనిదత్ గారు నిర్మించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు, వేటూరి వారి కలం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది.

స్వరరాగ గంగా ప్రవాహమే, గోదావరి పైఎద రెండు నాకు నచ్చిన పాటలు. మన తెలుగమ్మాయి రంభని మరిచిపోలేం, తరువాత ఆ మాత్రం నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు రాకపోవడం బాధాకరమే.

బాలు చిత్రా పాడిన ఈ పదహారణాల తెలుగు పాట మీకోసం


గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే 
నండూరి వారెంకిలా ఓ...
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల 
కిన్నెరసాని పాటలా ఓ...॥


సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము॥
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో 
నా స్వప్న లోకాలలో
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో 
నా బాహు బంధాలలో

https://www.youtube.com/watch?v=1vMaX9IoQSA

No comments:

Post a Comment