మిత్రులకి శుభోదయం
వారసులు చాలామంది వస్తారు కొంతకాలం చూడగలం, ఒకటో రెండో చిత్రాలు, నిజంగా talent లేకపోతే చూడంకదా, సుమారు 40 వసంతాలనుంచి తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక సుస్తిరమైన స్థానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులు గమనించారో లేదో, వారి చిత్రాలలోని పాటలు చాలా బాగుంటాయి. ఆదిత్య 369 కానీవండి, భైరవద్వీపం, పాండురంగడు, శ్రీ రామరాజ్యం, ముద్దుల మావయ్య, ధర్మక్షేత్రం గాండీవం అశ్వమేధం ఒకటా రెండా ఎన్నో మంచి musical హిట్స్ ఉన్నాయ్ వారికి.
ఆదిత్య 369 లో అన్ని పాటలు బాగుంటాయి, రాసలీల వేళా అంటే చాలా ప్రీతి, రాజా గారు అద్భుతంగా చేసారు. వెన్నెలకంటి గారి కలం చాలా మాయలు చేసింది, చాలామంది అనుకుంటారు ఇది వేటూరి గారిదేమో అని. ఇంతమంచి సాహిత్యం రాయగలిగిన వెన్నెలకంటి గారు డబ్బింగ్ చిత్రాలకి పరిమితం కావడం కొంచెం బాధాకరమే. రెండో చరణంలో "మోయలేని తీయని పాయి పూల జల్లులు" అనే లైన్ లో పాయి అనేలా వినిపిస్తుంది అలా అయితే కొంచెం శృంగారం పాళ్ళు ఎక్కువనే చెప్పాలి.
రాసలీల వేళ రాయబారమేలా మాటే మౌనమై మాయ చేయనేల
రాసలీల వేళ రాయబారమేలా
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లే పగటి వెన్నెల
మోజులన్ని పాడగా జాజి పుల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోన సోదలుమాని
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు
No comments:
Post a Comment