Wednesday, June 3, 2015

tooneega tooneegaa

మిత్రులకి వందనం

R  P  పట్నాయక్ చాలానే మంచి చిత్రాలకి సంగీతం అందించారు, almost అన్నీ హిట్స్ అనే చెప్పాలి, చిత్రం, నువ్వు నేను, జయం, నిజం, మనసంతా నువ్వే, కాని మనసంతా నువ్వే లో హిట్ సాంగ్ తూనీగా తూనీగా పాట విద్యాసాగర్ గారి పాటని copy  చేసారు. ఎవరు చేసినా మంచి మెలోడీ. అచ్చమైన తెలుగు వాడైన విజయనగర వాస్తవ్యుడు విద్యాసాగర్ కి అనుకున్నంతపేరు తెలుగులో రాలేదు, కాని మలయాళం లో అయిన చాలా చిత్రాలకి సంగీతం అందించారు, అక్కడ టాప్ కంపోసర్. తెలుగులో ముగ్గురు మొనగాళ్ళు, స్వరాభిషేకం,  K R R  తనయుడి నీతో లాంటి ఎన్నో చిత్రాలు చేసినా ఎందుకో రావలసిన గుర్తింపు రాలేదు.

శాస్త్రి గారు రాసిన మనసంతా నువ్వే చిత్రం లోని నాకు బాగా నచ్చిన తూనీగా తూనీగా పాట ఈ రోజు మీకోసం


తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా  నీ వెనకాలే రానీ సాయంగా

ఆ వంకా ఈ వంకా తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్కా
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశందాకా
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా  నీ వెనకాలే రానీ సాయంగా

దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీత కోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి  నీతో ఆడి  చందమామ అయిపోయాడుగా

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి తిరిగొచ్చే దారిని ఎపుడు మరిచిపొవెలా
ఓ సారటువైపెళుతుంది మళ్ళి ఇటు వైపోస్తుంది
ఈ రైలుకి సొంతూరేదో గురుతురాదెలా
కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగా  నీ వెనకాలే రానీ సాయంగా

https://www.youtube.com/watch?v=58ArrWB_3z4

https://www.youtube.com/watch?v=QOoGuu-o2wg

No comments:

Post a Comment