మిత్రులకి వందనం
హంసలేఖ గారి పేరు వినే ఉంటారు, మంజునాథ చిత్రానికి సంగీతం అందించారు, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, తెలుగులో తక్కవ చిత్రాలు చేసినా మంచి చిత్రాలు చేసారు, శాంతి క్రాంతి, మంజునాథ, ప్రేమ యుద్ధం, ముత్యమంత ముద్దు, అంకురం (ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ) లాంటి ఎన్నో మంచి చిత్రాలకి సంగీతం అందించారు. కన్నడ చిత్ర సీమలో సంగీతమే కాకుండా, కధ, స్క్రీన్ ప్లే, గీత రచన కూడా చేసారు.
వర్షాకాలం మొదలైంది వాన పాటలు గుర్తుకొస్తున్నాయి, ప్రేమ యుద్ధం లో స్వాతి ముత్యపు జల్లులలో అంటే చాలా ఇష్టం నాకు, బాలు జానకమ్మ అద్భుతంగా పాడారు. వేటూరి వారి కలం స్వాతి ముత్యాల జల్లు కురిపించింది.
ఈ మద్య ఈ పాటని రీమేక్ చేసారు యాక్షన్ 3D అనే చిత్రంలో, రీమేక్ సాంగ్స్ disasters అని నిరూపించింది, ఆ ఫిమేల్ సింగర్ ( దివిజ) మరీను, సర్లెండి వాళ్ళ అంతే, పాత పాటే విందాం.
ముందుగా కన్నడాలో వచ్చిన ఈ చిత్రం రవిచంద్రన్ చేసారు, తెలుగులో నాగార్జున. రెండు భాషలలోను అమలే కధానాయిక.
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో "2"
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగేనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగేనులే

నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగేనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగేనులే
ముసురేసిందమ్మ కబురే కసిగా తెలిపే తడిగా ఓడినే దులిపి
జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మ తనువూ తనువూ కలిపి తనతో సగమే చెరిపి
చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మేలి తిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
మతి పోయిందమ్మా మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసి
జలపాతం నీవైతే అలగీతం నేనేలే
కసి రేగిందమ్మ కలతో నిజమే కలిసి దివినీ భువినీ కలిపి
సిరి తారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శ్రుతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా
https://www.youtube.com/watch?v=t3wjF6HzOnA
https://www.youtube.com/watch?v=--Dz-c5tx68

No comments:
Post a Comment