Friday, June 5, 2015

raa raa


మిత్రులకి వందనం

రెండురోజుల క్రితం పెట్టిన పోస్ట్ లో విద్య సాగర్ గారి ప్రస్తావన చేసాను, ఈ రోజు అయిన చేసిన చంద్రముఖి చిత్రం లోని "రా రా "పాట చూద్దాం. 2004 లో సౌందర్య చేత కన్నడం లో ఆప్తమిత్ర అనే చిత్రం వీటన్నిటికి మాతృక, ఆ చిత్రానికి గురుకిరణ్ సంగీతం, ఆచ్చు గుద్దినట్టు విద్యాసాగర్ చేసారు (దర్శకులు చెప్పి ఉంటారు).

"సూర్య సల్లాప" అనే రాగంలో చెయ్యబడింది ఈ పాట, నాకు తెలిసి తెలుగులో ఈ రాగంలో వేరే పాటలు లేవు, maybe నేను correct కాక పోవచ్చు, చాలామంది సూర్య రాగం అని కూడా అంటారు.

నిజం చెప్పాలంటే సంస్కృతం అన్ని భాషలకి ఎల్లా మూలమో, ఇళయరాజా చలనచిత్ర గీతాలకి రాగాలని వాడడం అంతే  అంటా, "తాయి మూకంబికై" అనే తమిళ చిత్రంలో ఇళయరాజా గారు, సుశీలమ్మ, జానకమ్మా, L  రాజేశ్వరి ముగ్గిరి చేతా  ఒక పాట చేసారు "ఇసై అరసి ఎన్నాలుమ్ నానే" అనే పాట, ఆ లింక్ కూడా పెడుతున్నా వినండి, ఈ పాట కూడా సూర్య సల్లాప లో చేసినదే. అలాగే A R సంగీత దర్శకత్వం వహించిన హ్రుదయాంజాలి అనే చిత్రం లోని "మానస వీణా" (మిత్రులకి మునుపు పరిచయం చేసా ఆ పాట) కూడా ఇదే రాగం,  ఆ పాట విన్నాక రెహమాన్, గురుకిరణ్, విద్యా సాగర్ లు చాలా inspire అయి చేసుంటారు.

చంద్రముఖి ఒరిజినల్ గా తమిళ చిత్రం, తమిళ versionలో తెలుగు పాట, తెలుగు versionలో తమిళ పాట పెట్టారు, లిప్ సింక్ చూడండి ముందుగా తెలుగులో చేసి దానికి తమిళ లో డబ్బింగ్ చేసారు. భువనచంద్ర గారు రాసారు.


https://www.youtube.com/watch?v=MQ9nMS4H-fs

https://www.youtube.com/watch?v=-MjW6xXGnAc

https://www.youtube.com/watch?v=rrEZlbXRdak


No comments:

Post a Comment