Monday, June 29, 2015

evaro okaru epudo apudu

మిత్రులకి వందనం

ఈ మద్య హంసలేఖ గారి ప్రస్తావనలో చెప్పా వారు చేసిన మంచి చిత్రాలలో అంకురం ఒకటి, ఈ చిత్రంలో ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు పాట అంటే నాకు పరమ ప్రీతి, నా టీనేజి లో వచ్చిన ఈ చిత్రం నా అభిరుచి, నా ఆలోచనని మార్చింది అంటే అతిశయోక్తి కాదు, అందులోను సీతారామ శాస్త్రి గారి పాట అంటే మరీను.

ఉమమేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు) పురస్కారం పొందింది.

బాలు చిత్రా పాడిన ఈ పాటకి ఉత్తమ గీత రచనకి పురస్కారం రాలేదని బాధపడ్డా,

శాస్త్రి గారు చూడండి ఎంత గొప్పగా అంటారో, చెదరక పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..దానికి లెక్క లేదు కాళరాతిరి.., మనం ప్రతి సారి, ప్రతి పనిలోనూ అనుకుంటాం నా ఒక్కడి వలన 

ఎమౌతుంది అని, ఉడుత అలా అనుకోలేదు అని రామాయణం చదివాక తెలుసుకున్నాం, చిన్నప్పుడు 

చదువుకున్న అభిషేకానికి రాజుగారు అడిగిన పాల కధ గుర్తొస్తుంది ఈ పాట విన్నాప్ప్పుడల్లా. 

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది ..

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

కదలరు ఎవ్వరూ ...వేకువ వచ్చినా 
అనుకొని కోడి కూత నిదరపోదుగా.. 
జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే 
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే.. 
వాన ధార రాదుగా నేల దారికి 
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

చెదరక పోదుగా చిక్కని చీకటి 
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని 
రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా? 
జాలి చూపి తీరమే దరికి చేరునా..?

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

యుగములు సాగిన... నింగిని తాకక 
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా 
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో  ఒళ్ళు మండితే.. అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా?.. 
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా ..?

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

https://www.youtube.com/watch?v=i2A44XJH1EU

No comments:

Post a Comment