Saturday, December 24, 2016

మిత్రులకి వందనం

కురిసి కురిసి వెన్నెలలో గగనమలసి పోయింది
వేచి వేచి అడుగులకోసం దీపమారిపోయింది

పెరటిలోని జాజి తీగ పలకరించి పూచింది
ఆశలన్ని ఓడిపోయి మాట చిన్న బోయింది

చెరువు గట్టు చెట్టుమీద జ్ఞాపకాలు రేపింది
నీవు లేవు అన్న తలపు కనులనీరు నింపింది 

Thursday, December 22, 2016

నిలువదే శతమానంభవతి

మిత్రులకి వందనం

చాలా చాలా రోజులైంది ముమ్ములని పలకరించి, కొందరు అనుకుంటూవుంటారు హమ్మయ్య వీడు ఆపాడురా అని. కానీ మంచి పాట వింటే వెంటనే మీరందరు గుర్తొస్తారు, ఈ మధ్య ఆడియో రిలీజ్ అయిన శతమానంభవతి పాటలు విన్నాక తప్పకుండా మీతో నా అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది.

దిల్ రాజు నిజంగానే మంచి దిల్ ఉన్నవారు, వారి చిత్రాలలో పాటలకి పెద్ద  పీటే వేస్తారు. వెంటేశ్వర క్రియేషన్స్ బేనర్ పైన దిల్ రాజు గారు నిర్మిస్తున్న "శతమానంభవతి" చిత్రం లో బాలు గారు పాడిన "నిలువదే" పాట భలే నచ్చేసింది, మిత్రులు చిన్న శాస్త్రి గారు (రామజోగయ్య ) గారు రాసిన ఈ పాటకి  మిక్కి జె మేయర్ సంగీతం సమకూర్చారు.

వినగానే బలుపు చిత్రంలోని బాలు గారు పాడిన "నినుచూసిన క్షణంలో" పాటలా అనిపించినా అంతకన్నా బాగుంది.

ఇక పాడిన బాలు గారి గురించి ఎం చెప్పాలి, డెబ్భైల్లో కూడా ఇంత మధురంగా ఎలా పాడగలుగుతున్నారు అనిపిస్తుంది ఈ పాట వింటే. పాటలో "పలకదే" అనే చోట బాలు గారు ఒక్కోసారి ఒక్కోలాగ అనడం, ఎంత పాషన్ తో పాట పాడతారో అనిపించింది.

ఈ తరంలో సీతారామ శాస్త్రి గారి గురించి తప్ప వేరే కవులగురించి రాయాలనిపించేది కాదు, వారి ప్రభావం అంతాగా ఉంటుంది నామీద, కానీ రామజోగయ్య శాస్త్రి గారు రాస్తున్న పాటలు కొన్ని నా ఆలోచనని మారుస్తున్నాయి, ప్రేరేపిస్తున్నాయి, ఉత్సాహపరుస్తున్నాయి, ఆనందింపచేస్తున్నాయి, అన్నిటికన్నా వినడానికి (కుమ్ముడు, దున్నుడు లాంటివి లేకుండా) చక్కటి పదాలతో, మనసుకు హత్తుకున్నట్టు రాస్తున్నారు, అయ్యా ఇంకా రాయండి మేము వింటాం, ఇల్లాంటి పాటలు వినే తెలుగు వాళ్ళం ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాం. నాకు బాగా నచ్చిన లైన్ "దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా".

మిగతా పాటలు కూడా చాలా బాగున్నాయి అందుకే జ్యూక్ బాక్స్ అంతా షేర్ చేస్తున్నా, పదాలు వినపడేట్టు శ్రావ్యయమైన సంగీతం ఇస్తున్న మిక్కీ జె మేయర్ గారి అభినందించకుండా ఉండలేం.

త్వరలోనే రిలీజ్ కాబోయే ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నా.

ఈ పాట 11:25 లో ప్రారంభం అవుతుంది.


నిలవదే మది నిలవదే
శిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడిన
కొంత మిగిలిపొయేంత
అందం నీది

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదొ లాంటి తేనల  బాణం
దిగదా ఎదలొకి

నువ్వు నడిచే దారులలొ
పూల గంధాలె ఊపిరిగా
కధ నడిచే మనసు కదే
హాయి రాగల ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన సరదా
నినువిడి మనగలదా

ఎలా నీకు అందించాలొ
ఎదలొ కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి
ఎదుటే నిలిచాను

చదువుకునే బదులిదని
చెప్పుకొలేవులే మనసా
పదములతొ పనిపడని
మౌనమే ప్రేమ పరిభాషా
తెలుపక తెలిపిన
వలపొక వరమని
కడిలిగ అలలేగసా

https://www.youtube.com/watch?v=WhEBrjlzBc4

Thursday, August 25, 2016

alokaye sri bala krishnam

మిత్రులకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాభినందనములు

కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా.

నారాయణ తీర్థులవారి ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఎంత హృద్యంగా ఉంటుందో, శ్రీమాన్ విశ్వనాధ్ గారు వారి శృతిలయలు చిత్రం కారణంగా చాలామందికి (కామన్ పీపుల్ ) ఈ పాట గురించి తెలిసిందనే చెప్పాలి. వాణీజయరాం గళంలో మరింత శ్రావ్యంగా ఉంటుంది ఈ మహదేవన్ గారి స్వరకల్పన.

విశ్వనాధ్ గారి వలన, వారి చిత్రాలవలన తెలుగు వారికి ఇల్లాంటి సంగీత నృత్య సంబందిత చిత్రాలని, పాటల్ని చూసే అవకాశం కలిగింది.

ఏలూరు వాస్తవ్యులు శ్రీమాన్ కొరడా సత్యనారాయణ గారి దగ్గర శిష్యరికం చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారి.

చిత్రంలో వాడని 3 చరణాలని మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది, తప్పులుంటే పెద్దలు దిద్దగలరు.

మీకందరికీ మరోసారి కన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు.

ఈ పాట చూసి మీ పిల్లలని వెంటనే కన్నయ్యలుగా, రాధమ్మలా చేసెయ్యండి, భలేవుంటారు కదా,  నేను వెళ్ళాలి ఇంటికి మా బలరామ కృష్ణులని తయారుచేయాలి.


ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే||
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణమ్ 
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ 
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనమ్ అఖండ విభూతి కృష్ణమ్ 
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్ 
నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ 
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్ 
వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ 
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్ 
నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ 

https://www.youtube.com/watch?v=VNnnt2_uD9E

Wednesday, August 24, 2016

sadasiva sanyasi

మిత్రులకి వందనం 

నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది సీతారామశాస్త్రి గారు కాకుండా ప్రస్తుతం ఉన్న కవివర్యులు సందర్భానుసారంగా పాటలు రాయగలరా అని, కానీ ఆ లోటు శ్రీమాన్ దరివేముల రామజోగయ్య శాస్త్రి గారు తీరుస్తున్నారు. అయ్యా మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. వారి శిష్యరికం చేసిన వారందరు మంచి కవులే మీకులా. వారి లక్షణాలు మరింత అలరచుకుంటారని మరిన్ని మంచి సాహిత్యమున్న పాటలు  మాకు అందిస్తారని కోరుతున్నాం. నాకు తెలిసి రెండుభాషలలో పాటలు రాసింది వీరేనేమో, రాజశ్రీ గారు తమిళం తెలుగు రెండు భాషలలో రాసారని విన్నా కానీ కాన్ఫిర్మ్ కాదు. RJS గారు తెలుగులో రాయడానికి ముందు కన్నడంలో పాటలు రాశారు. అయ్యా ఏమైనా తప్పులుంటే తెలియజేయగలరు. 

వీరిని కూడా శాస్త్రి గారు అని పిలవడం భలే గా ఉంది, నా భాషలో శాస్త్రి గారంటే సీతారామ శాస్త్రి గారే అని మిత్రులు నవ్వుతూ ఉంటారు. 

ఈ చిన్న శాస్త్రి గారు మనందరికీ సదాశివ సన్యాసి పాటతో బాగా దగ్గరయ్యారు. ఈ రోజు మీకోసం ఈ పాట మహేష్ ఖలేజా నుంచి. మణిశర్మ గారి స్వరకల్పన, మన పదహారణాల తెలుగబ్బాయి కారుణ్య, రమేష్ వినాయగం తో కలిసి పాడారు. 

శాస్త్రి గారు మంచి గాయకులూ కూడా, సినిమాలో వాడని కొన్ని చరణాలు మా టీవీ ఇంటర్వ్యూలో వారే పాడారు అది కూడా వీక్షించండి. 

అయ్యా మరొక్క సారి జన్మదిన శుభాభినందనలు. 


ఓం  నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, 
ఓం నమో హర నాగాభరణాయా..ప్రణవాయ, 
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ..
ఓం  నమో నిఠలాక్ష్యాయ, ఓం  నమో  భస్మాంగాయ, 
ఓం నమో  హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!!

పల్లవి:
సదాశివా  సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్ సూపుల సుక్కాని  దారిగా,  సుక్కల తివాసీ మీదిగా,
సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా..

ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు  జంగమ శంకర శివుడేనురా..
నిప్పు గొంతున  నీలపు మచ్చ సాచ్చిగా , నీ తాపం, శాపం తీర్చేవాడేరా!!
పైపైకలా.. బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల!!

లోకాలనేలేటోడు  నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె  కొలువున్నోడు, నిన్ను దాటి పోనే  పోడు!!

om namashiva jai jai jai  || 2 ||
om namashiva go to the trans and say jay jay
sing along sing shiv shambo all the way
om nama shiva jai jai jai heal the world is all we pray
save our lives and take our pain away jai jai 
sing along sing shiv shambo all the way

సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్..ఎక్కడ వీడుంటే  నిండుగా, అక్కడ నేలంతా పండగ..
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా  కాచే దొరలాగా!!

మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా..
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా!!
సామీ అంటే హామీ  తనై ఉంటాడురా చివరంటా!!

లోకాలనేలేటోడు  నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె  కొలువున్నోడు, నిన్ను దాటి పోనే  పోడు!!
        



https://www.youtube.com/watch?v=Aq0yDPug3W0

https://www.youtube.com/watch?v=G5iTugfFvP4


https://www.youtube.com/watch?v=Pgwhpwo_XaI

Monday, August 22, 2016

cheppalani undi gontu vippalani undi

మిత్రులకి శుభోదయం

చిరంజీవి గారి వీరాభిమానిని ఈ రోజు వారి పాట మీకు గుర్తుచెయ్యకపోతే నా అభిమానానికి  అర్ధం లేదు.

పుట్టినరోజు శుభాకాంక్షలు చిరు. మీ 151 వ చిత్రం కోసం చాలా కాలంనుంచి వేచి ఉన్నాం ఎప్పుడెప్పుడా అని.

చిరంజీవి గారు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన రుద్రవీణ చిత్రం అంటే మీకందరికీ తెలిసందే నాకు పరమ ఇష్టం అని. ఆ చిత్రంలోని కొన్ని పాటలని మిత్రులకి అంతకుముందు పరిచయం చేశా, అదే చిత్రంలో చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలో శ్రీ శ్రీ గారి నేను సైతం జోడించడం పాటని మరో ఎత్తుకి తీసుకెళ్లింది, రాజా గారి సంగీతం అద్భుతం. బాలు గారితో కలిసి మనో పాడిన ఈ పాట మీకోసం ఈరోజు.  అన్ని చరణాలు ఉన్న వీడియో దొరకలేదు.

మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు.


ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేదీ
మంచైనా చెడ్డయినా పంచుకోను నే లేనా
ఆమాత్రం ఆత్మీయతకైనా పనికి రానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది " 4 "
గుండెల్లో సూడి తిరిగే కలత కధలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వేలి వేస్తె అయినా నేనేకాకిని

పాట బాట మారాలని చెప్పడమే నానేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనే పాట పంచవన్నెల వీరి తోట

బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుటా?
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట?

ఎటి పొడుగునా వసంతమొక్కటేనా  కాలం?
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుమ్భవ్రిష్టి జడీలో ఇంకొకడు
మంచు వంచనకు మోడైగోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నాదేరాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన న ప్రశ్నకు అలిగే పెద్ద కోకిల
కళ్ళు వున్నా కబోదిలా
చెవులు వున్న బధిరుడిలా నూతిలో కప్పలా
బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయెను నా  స్థానం

అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి  సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతి తో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరి చెయ్యాలి జన గీతి వద్దనుకుంటు నాకు నేనే పెద్దనుకుంటు కలవు జీవించాను నేను కలవరింత కోరాను నేను.


నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రొస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని  శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పడలేను కొత్త బాటను వీడి పోను
నేను సైతం నేను సైతం నేను సైతం

https://www.youtube.com/watch?v=gSkwSSJV7Rg


Wednesday, July 6, 2016

మిత్రులకి వందనం

ఈ మధ్య చాలా మంది మిత్రులు మంచి పాటలు గుర్తుచేస్తున్నారు వారందరికీ ధన్యవాదములు.

ఒక్క మనవి ఆల్రెడీ గుర్తుచేసిన పాటలని మళ్ళీ పెడుతున్నారు అల్లా చెయ్యకండి, ఇంకొక్క మనవి ఆ పాట యొక్క గొప్పతనాన్ని, కవి గొప్పతనాన్ని, సంగీత దర్శకుల గురించి వివరించండి బాగుంటుంది. అందరం తెలుసుకుందాం మన సాహిత్యం గురించి సంగీతం గురించి.

బాలు గారు రాధికతో కలిసి నటించిన ఓ పాపా లాలి అనే చిత్రం చేశారు, అందులో breathless song పాడారు బాలుగారు ఈ రోజు మీకోసం ఆ పాట.

ఎప్పుడో 2012 లో youtube లో మాటేరాని చిన్నదాని పాట కరోకే నా ఛానెల్లో పెట్టా, ఎందుకో సెర్చ్ చేస్తూ ఉంటే దొరికింది మిత్రులకి గుర్తుచేద్దాం అనిపించింది, చాలామంది మిత్రులు గాయకులు కూడా ఉన్నారు, అల్లా  కాకపోయినా మనందరం బాత్రూం సింగర్సే కదా పాడేసుకుందాం ఈ వేటూరి వారి పదాల మల్లిక, రాజా గారి స్వరాల అల్లిక మనగొంతులో.

https://www.youtube.com/watch?v=Cogk5nlg-OA&index=36&list=PLE13AFDB7B01EBBA5

Friday, June 10, 2016

మిత్రులకి శుభోదయం

చాలా పాటలు మిత్రులకి గుర్తుచేస్తున్నాం ఈ పేజీ ద్వారా, కాని మొదటిసారి బోలెడన్ని పాటలు ఒకేసారి వినిపించాలనిపించింది, ఉదయం ముఖపుస్తం  తెరిచి చూస్తే శ్రీమాన్ రామజోగయ్య శాస్త్రి గారు సౌజన్య-సౌమ్య అనే ద్వయం పాడిన పాత పాటల మాలిక పెట్టారు. అబ్బా మెట్రోలో వస్తూ చెవిలో ఇయర్ ఫోన్స పెట్టుకుని ప్రపంచాన్ని మరిచిపోయా, విజయావారి చందమామ అంత చల్లగా, ANR గారి అంత handsome గా, సావిత్రి గారి అంత అందంగా, కృష్ణశాస్త్రి గారి కవితలా ఆహా ఎంత ఆనంద పడ్డానో. మీరు ఆనందిస్తారని పెడుతున్నా.



https://www.youtube.com/watch?v=uISfXNH2lww&spfreload=5

Friday, June 3, 2016

పుచ్చా పువ్వుల విచ్చే తావుల

మిత్రులకి వందనం

మన గ్రూప్ లో ఒక మంచి గాయకులు ఉన్నారు వారు పార్ధసారధి, మొదటి తరం పాడుతాతీయగా నుంచి వారిని ఫాలో అవుతున్నా. చాలా మంచి పాటలు పాడారు వారు (చిరు గారి కోసం బంగారం తెచ్చి) వారు పాడిన, నాకు బాగా ఇష్టమైన పాట "పుచ్చా పువ్వుల విచ్చే తావుల" అని మనోహరం సినిమా లోనిది. వేటూరి వారి అందమైన పువ్వుల వర్షం కురిపిస్తే దానికి మణిశర్మ గారు పుప్పొడి రాగాలు అద్దారు. దానికి గుణశేఖర్ గారి రంగుల అద్దకం మరింత శోభని అందించింది. చిత్రమ్మ తో కలిసి నేమాని వారు పాడిన ఈ పాట మీకోసం ఈ రోజు.

తప్పులేమైనా ఉంటే మిత్రులు సరిదిద్దగలరు


పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు
పచ్చా మీగడలిచ్చే తియ్యన తెచ్చే నీ కలలు
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా
ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే  సంధ్యల్లో
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా


గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలకువ
వీణ మీటె  సెలయేరు చలి వేణు ఊదే  చిరుగాలి
కలువ కనులలోనా కలవరింతలాయే
చలువ తనువులోనా జలదరింతలాయే

ఓ ఓ ఓ ఓ

పిండి వెన్నెల వండి వార్చిన వెండీ  ఇసకల్లో
తెల్లా మబ్బుని  వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చినాయమ్మా వచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా అలజడులొచ్చినాయమ్మా

లేత పచ్చికల అణకువ నును లేత మచ్చికల తొణకవ
నిండు అల్లికల నవ నవ తలదిండు మల్లికల శివ శివ
పట్ట పగటి ఎండా పండు వెన్నెలాయే
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే

ఓ ఓ ఓ ఓ

ఊరా వాకిలి తీసే  తియ్యని దొరా వయసుల్లో
మాఘామాసపు మంచు బెబ్బులి పోంచే వేళల్లో
వచ్చినాయమ్మా గిచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా వలపులు గిచ్చినాయమ్మా



https://www.youtube.com/watch?v=-rmIIVvXMB4

నిను చూసిన క్షణంలో

మిత్రులకి వందనం

బాలు గారు లేని తెలుగు సినిమా ని ఉహించుకోలేము కదా, అవును ఆయిన మన తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం. ఈ రోజు వారి  సప్తతి, అయ్యా మీకు ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా బోలెడన్ని పాటలు మాకోసం పాడాలని కోరుకుంటున్నా.

ఈ మధ్య వారు బలుపు అనే చిత్రం కోసం ఒక పాట పాడారు, నిను చూసిన క్షణంలో అనే సీతారామ శాస్త్రి గారి పాట. ఇప్పటివరకు నేను తమన్ చేసిన ఒక్క పాట కూడా మిత్రులకి పరిచయం చెయ్యలేదు, మొదటిసారి ఈ పాట సినిమా లో చూసి చాలా ఆశ్చర్య పడ్డా. తమన్ ఇల్లాంటి పాట కూడా చెయ్యగలరా అనిపించింది. సూపర్ మెలోడీ.

ఈ పాట మీద మక్కువ పెరగడానికి మరో కారణం విశాఖ అందాలతో పాటు, మా చందనాల వాడి కొండ, కైలాస నాధుడి అండా రెండు చూపించారు దర్శకులు.


నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చేయి జారిన మనస్సు ఏమైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరిచిన మనస్సు ఏమైందో

అలా హలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో
ఏమైందో ఏమైందో నువ్వు ఒక్కసారి చూడు ఏమైందో

నాకు నీ పరిచయం మరొక జన్మేనని నీతో
పైకేల చెప్పడం నమ్మనంటవో ఏమో
తెలియని ఆ నిజం నీకు ఏ నాటికొ
ఇన్నాళ్ళ నా ఏకాంత ఇంక  ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలయిందనొ


https://www.youtube.com/watch?v=zNpXBt8A2FI

Saturday, May 28, 2016

ఏ చిలిపి కళ్ళలోన కలవో

మిత్రులకి వందనం

గౌతమ్ మీనన్ మనకి బాగా తెలిసిన పరభాషా దర్శకుడు, కొన్ని డైరెక్ట్ తెలుగు చిత్రాలు కూడా తీసారు రీమేక్ అయినా సరే, అందులో ఒకటి వెంకటేష్ గారి ఘర్షణ, తమిళంలో కాక్కా కాక్కా గా సూర్య జ్యోతిక చేస్తే, ఇక్కడ అసిన్ దగ్గుపాటి వారి తో చేసారు.

సోదరుడు కులశేఖర్ ఈ చిత్రానికి పాటలు మాటలు కూడా రాసారు. హరీష్ జయరాజ్ సంగీతం. చెప్పాలంటే పాటలన్నీ బాగుంటాయి. అన్నిటికంటే నాకు ఏ  చిలిపి కళ్ళలోన కలవో పాట అంటే మరీ ఇష్టం. శ్రీనివాస్ చాలా బాగా పాడారు.

ఈ పాటలో జడ కుచ్చుల్లోన్నా మల్లెవొ  అనడం తప్పని ఒకసారి ఓ T V ప్రోగ్రాం లో ఒక కావిగారు అన్నారు. కుచ్చు జడ కొసన ఉంటుంది కదా అక్కడ మల్లెలెలా పెట్టుకుంటారని వారి అభిప్రాయం. కాని నేను ఎందుకో వారితో ఏకిభవించ లేక పోతున్నా, ఉత్తర ఆంధ్రా ప్రాంతంలో జడ కుచ్చు తీసుకోవడం అనే వాడుక ఉంది, జడ కొసని కట్టుకునే వాటిని కుప్పెలని వాడుక. పెద్దలెవరైనా ఇంకొంత వివరణ ఇవ్వగలరు.

ఏమైనా ఒక మంచి పాట ఇచ్చాడు సోదరుడు, అన్నా నువ్వు మళ్ళి రావాలి, నీ ప్రతాపం చూపాలి. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా.


ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)

ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం
స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నువ్వు నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో (2)

https://www.youtube.com/watch?v=iaYRWdQxjLI&spfreload=5

Monday, May 23, 2016

మౌనమే ప్రియా ధ్యానమై

మిత్రులకి వందనం

ఈ మధ్య  స్నేహితుడు నాగేశ్వరరావు (నాని గారు) కామెంట్ లో చిన్నికృష్ణుడు చిత్రం లోని మౌనమే ప్రియ పాట ప్రస్తావన తెచ్చారు, నిజంగానే జానకమ్మ పాడిన ఈ పాట కూడా చాలా బాగుంటుంది. పంచం దా (R D Burman ) సంగీతం అపురూపం అజరామరం. వేటురిగారు రాసారని మళ్ళి చెప్పాలా?


మౌనమే ప్రియా ధ్యానమై  
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా  ధ్యానమై  
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా ధ్యాన్నమై 

చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు 
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు 
వెన్నెలలో కాగే తారా మందారాలు 
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ 
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయే 
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో 

మౌనమే ప్రియా ధ్యానమై 
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 

కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు 
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు 
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు 
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు 
వచ్చే మాఘమాసం పందిరేసి ముందుగానే 
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ 
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో 

మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా  ధ్యానమై 
మౌనమే ప్రియా  ధ్యానమై 

https://www.youtube.com/watch?v=xj5Xr_xgC5g

వేణువై వచ్చాను భువనానికి

మిత్రులకి వందనం

నిన్నటికి సరిగ్గా 6 సంవత్సరాలు మహానుభావులు శ్రీమాన్ వేటూరి సుందరరామ్మూర్తి గారు మనల్ని విడిచి.

1974 లో శ్రీ శ్రీ గారి తరువాత ఇరవై సంవత్సరాలకి వేటూరి గారు మాతృదేవోభవ చిత్రానికి నేషనల్ అవార్డు మనకి అందించారు " రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి. అదే చిత్రంలోని వేణువై వచ్చాను భువనానికి పాట నాకు బాగా ఇష్టం, ఈ పాటతో వారిని మరొక్క సారి గుర్తు చేసుకుందాం, చిత్రమ్మ గొంతు ఎంతో ఆద్రతతొ వినిపిస్తుంది. కీరవాణి గారి సంగీతం ఇంకేం కావాలి ఒక మంచి పాటకి.

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

https://www.youtube.com/watch?v=W4yM7Wk1zRc

https://www.youtube.com/watch?v=jzTMSbJbmUg

Friday, May 20, 2016

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా.

మిత్రులకి వందనం

చాలా చాలా రోజులైంది మిమ్ములని పలకరించి

ఈ రోజు గురువు గారు శాస్త్రి గారి జన్మదినం వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు

సిరివెన్నెల గారు ఎన్నో స్పూర్తివంతమైన పాటలని రాసినా మళ్ళీ ఇంకో కొత్త పాట రాసిన ప్రతీసారీ సరికొత్తగా "అవున్నిజమే కదా" అని మనం బుద్ధిగా తలూపేలా అలవోకగా బతుకు పాఠాలు చెప్తుంటారు. అలాంటి ఒక పాట ఇది కూడా మొదటి సినిమా కోసం రాసారు, సినిమా హిట్ కాక పొతే మరుగున పడిపోతుంది పాట అలాగే ఈ పాట కూడా చాలా కొంచెం మంది విని ఉంటారు. 

ఈ పాటలోని ప్రతీ వాక్యం నిరాశా నిస్పృహల్ని తరిమేస్తూ ఉత్తేజాన్ని కలిగించేదిగా ఉంటుంది. పాటలోని భావానికి శంకర్ మహదేవన్ గళం తోడై మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.


నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

ఎటు నీ పయనమంటే.. నిలిచేదెక్కడంటే..
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే!
ఎదలో ఆశ వెంటే.. ఎగసే వేగముంటే..
సమయం వెనుకబడదా ఊహ తన కన్నా ముందుంటే!
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా?మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ఈ ప్రశ్న?మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా..ఒకలాగే పూర్తయ్యేనా!

కసిరే వేసవైనా.. ముసిరే వర్షమైనా..
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా!
మసకే కమ్ముకున్నా.. ముసుగే కప్పుకున్నా..
కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా!
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం..
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతి గాయం..
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

అచ్చం ఇదే ట్యూన్లో ఇంకొక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. అది శ్రీ కుమార్ పాడారు. అది కూడా చాలా బాగుంటుంది. 

చేదైనా బాధైనా.. అన్నీ మామూలే..
మేడైనా కీడైనా.. ఎన్నో కొన్నాళ్ళే..
మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే..
ఎటు వైపున్నా నీ తీరం కలిసి వస్తుందే.. 
https://www.youtube.com/watch?v=XeNlajen_iE


https://www.youtube.com/watch?v=dlgcP_dXV3U

తనువులు మాయ

తనువులు మాయ తలపోసి తలపోసి
చెప్పెదనంటినా కర కరల మొహమిది
ఆశల పాషనంబిది అతుకుల జల్లెడ ఇది
తన బ్రతుకు కొరకు పోరాడి పోరాడి
యురులన్ చెరచెడు దుర్గంధంబు డొంక ఇది
నీరు బుగ్గ ఊట చెలమ
తూట్ల బాన తొడరి దుర్గంధమున గోలుచును
మాటలే కాని మరి యందును పసలేదు
నోటను  మురికి దంతముల పాచి
నాసికమున ఊళే నయనంబున పీళే
చెవిలోన గుల్మి చెట్టలకొంప
మూటకట్టుకున్న మలమూత్రముల తిత్తి
చీము నెత్తుటి జడి పురుగుల జలదారి
చిచ్చుట రోత పైత్యపు గోళా
పైగల పంచారంబిది తోలు గప్పిన డోలు సుమ్మిది
నమ్మిక లేదు నమ్మికలేదు నాటకములు ఆడెను బూటకముల బొమ్మా "2"
అమ్మ అమ్మా ఈ బొమ్మా
స్వామి సింహగిరి నరహరి నమో నమో దయానిధి..... 

Tuesday, January 26, 2016

vande maataram


మిత్రులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

వందేమాతరం గీతం గురించి మనలో చాలా మందికి తెలియదు, అది రాసిన శ్రీ బంకిం చంద్ర చటొపాద్యాయ తన ఆనందమాత నవల కోసం ఈ గీతాన్ని రాసారు 1882 లో. 1890 లో రవీంద్రనాథ్ టాగోర్ నేషనల్ కాంగ్రెస్ మీట్ లో పాడారట. ఆ రోజులలో బెంగాల్ రాష్ట్ర గీతం గా పాడేవారు, మిత్రులు కొంత చరిత్రని చదవగలరు. ఆ రోజులలో ఈ గీతాన్ని నేషనల్ సాంగ్ గా పెట్టడానికి వీలులేదని, దానికి కారణం ఈ గీతంలో దుర్గా మాతని స్థుతిస్తు ఉందని అది మిగతా మతాలవారికి ఇబ్బందని మొత్తం పాటకాకుండా కేవలం పల్లవి మొదటి చరణం మాత్రమే ఆలపిస్తున్నాం, కొందరు మిగతా చరణాలు బంగ్లా భాషలో ఉన్నాయని అది భాషా పరమైన విభేదాన్ని తెస్తుందని కూడా పెట్టలేదని చెప్తారు. ఏది ఏమైనా మొత్తం పాట పాడుకుందాం మన పిల్లలకి మొత్తం నేర్పిద్దాం. జై హిందీ వందేమాతరం.

वन्दे मातरम् सुजलां सुफलां मलयजशीतलाम् शस्यशामलां मातरम् । शुभ्रज्योत्स्नापुलकितयामिनीं फुल्लकुसुमितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुर भाषिणीं सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् । कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले, अबला केन मा एत बले । बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरम् ।। २ ।। वन्दे मातरम् । तुमि विद्या, तुमि धर्म तुमि हृदि, तुमि मर्म त्वं हि प्राणा: शरीरे बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति, तोमारई प्रतिमा गडि मन्दिरे-मन्दिरे मातरम् ।। ३ ।। वन्दे मातरम् । त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी, नमामि त्वाम् नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरम् ।। ४ ।। वन्दे मातरम् । श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरम् ।। ५ ।। वन्दे मातरम् ।।

https://www.youtube.com/watch?v=_2-GTLcy65M

Wednesday, January 20, 2016

nannaku premato

మిత్రులకి శుభోదయం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న మంచి దర్శకులలో సుకుమార్ ఒకరు. సరికొత్త కధా కధనంతో చిత్రాలని తెరకెక్కిస్తున్నారు. ఆర్య అయిన నేనొక్కడినే అయిన ఈ మద్య వచ్చిన నాన్నకు ప్రేమతో. చాలామంది విమర్శిస్తున్నారు బాలేదు ఓవర్ ఎమోషన్ అని, ఏమైనా పనికిమాలిన కుళ్ళు జోకులు డైలాగులకన్నా ఈ చిత్రం బాగుంది. J r . N T R అన్నట్టుగా మేమందరం నాన్న పిచ్చోళ్ళం. నాన్న అంటే అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. అమ్మా నాన్నల గురించి చెప్పమంటే "అమ్మ నా గుండె అయితే నాన్న ఆ గుండె చప్పుడు" అంటా.

విచిత్రంగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ కి ముందు ఈ చిత్ర సంగీత దర్శకులు DSP తండ్రి గారు సత్యమూర్తి గారు మరణించడం ఈ చిత్రం తండ్రి అనే ఎమోషన్ తో ఉండడం, వారికి వారి తండ్రి గారిమీద అమితమైన ప్రేమ అన్ని ఒక్కసారి రావడం. వారి తండ్రిగారిని దృష్టిలో పెట్టుకుని రాసి చేసిన ఈ పాట ఈ రోజు మీకోసం, నాకోసం ముఖ్యంగా @sandylya కోసం.

ఏ కష్టమెదురోచ్చిన కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచినా
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ  క్షణం

నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించినా

ఏ తప్పు నే చేసినా 
తప్పటడుగులే వేసినా 
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన 

ఏ ఊసునే చెప్పినా 
ఏ పాటనే పాడినా 
భలే ఉంది మళ్ళి పాడరా అని మురిసిపోయినా 

ఈ అందమైన రంగులలోకాన 
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన 
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో 
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో 
ఈ పాటతో ఈ పాటతో 

https://www.youtube.com/watch?v=7VY191_NiHA

Wednesday, January 6, 2016

anjali anjali

మిత్రులకి వందనం

మద్య మద్యలో పలకరిస్తా, ఈ రోజు ఇలా రావడానికి ముఖ్య కారణం దిలీప్ పుట్టినరోజు, ఎవరా దిలీప్ అనుకుంటున్నారా, అదే A R రెహమాన్, వారి అసలు పేరు దిలీప్, వారి తండ్రి గారు R K శేఖర్ హిందూ కావడం చేత ఆ పేరు పెట్టారు. రెహ్మాన్ 9 సంవత్సారాల వయసులో వారి నాన్నగారు చనిపోయాక ఒక సారి రెహ్మాన్ చెల్లి కి జబ్బు చేస్తే  క్వాద్రి ఇస్లాం అనే వ్యక్తీ పరిచయంతో తన చెల్లికి నయంకావడం ఆ అల్లా దయగా వారు నమ్మి వారి తల్లి గారి మతమైన ఇస్లాంని తీసుకున్నారు,  వారి తల్లి గారి పేరు కరీమా. ఎ మతమైనా ఎ దేముడైనా మనమంతా ఒక్కటే మనమంతా భారతీయులం అని గర్వంగా చెప్పుకున్నేట్టు చేసారు రెహ్మాన్.

రాజా గారి తరువాత నాకు బాగా నచ్చే సంగీత దర్శకులు రెహ్మాన్. ఎన్నో అద్భుతమైన పాటలు చేసారు మీకందరికీ తెలిసిందే. వారు డ్యూయెట్ చిత్రం కోసం చేసిన అంజలి అంజలి పాట అంటే మరి ఇష్టం. కదిరి గోపాల్ నాథ్ గారి సాక్సోఫోనే ఆహా అద్భుతం అమోఘం. రాజశ్రీ గారు రాసిన ఈ పాట బాలు గారు గొప్పగా పాడేరు చిత్ర గారితో కలిసి.

find another link for BGM of duet movie by Sri. Kadiri Gopalnath.

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

నిన్న దాక నువ్వు నేను ఇరువురం ఎవరని
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిపిన మది ఇది
కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి
ఎదురుగా తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

హ్మ్మ్ హా హ్మ్ మ్మ్మ్మ్ ఆ ఆ అ ఆ ఆ అ ఆఅ
కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిలపాతే ఇలా పలికినదెందుకో
చెలువుగా ఎద మారే మదువ నిధ
అమ్మవాస్య నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గానమాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవి ఐన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నులో నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవయిన వలపువని
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి



 https://www.youtube.com/watch?v=YUIEft7ZN_Y


https://www.youtube.com/watch?v=0dPy4aqODtM