మిత్రులకి వందనం
నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది సీతారామశాస్త్రి గారు కాకుండా ప్రస్తుతం ఉన్న కవివర్యులు సందర్భానుసారంగా పాటలు రాయగలరా అని, కానీ ఆ లోటు శ్రీమాన్ దరివేముల రామజోగయ్య శాస్త్రి గారు తీరుస్తున్నారు. అయ్యా మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. వారి శిష్యరికం చేసిన వారందరు మంచి కవులే మీకులా. వారి లక్షణాలు మరింత అలరచుకుంటారని మరిన్ని మంచి సాహిత్యమున్న పాటలు మాకు అందిస్తారని కోరుతున్నాం. నాకు తెలిసి రెండుభాషలలో పాటలు రాసింది వీరేనేమో, రాజశ్రీ గారు తమిళం తెలుగు రెండు భాషలలో రాసారని విన్నా కానీ కాన్ఫిర్మ్ కాదు. RJS గారు తెలుగులో రాయడానికి ముందు కన్నడంలో పాటలు రాశారు. అయ్యా ఏమైనా తప్పులుంటే తెలియజేయగలరు.
వీరిని కూడా శాస్త్రి గారు అని పిలవడం భలే గా ఉంది, నా భాషలో శాస్త్రి గారంటే సీతారామ శాస్త్రి గారే అని మిత్రులు నవ్వుతూ ఉంటారు.
ఈ చిన్న శాస్త్రి గారు మనందరికీ సదాశివ సన్యాసి పాటతో బాగా దగ్గరయ్యారు. ఈ రోజు మీకోసం ఈ పాట మహేష్ ఖలేజా నుంచి. మణిశర్మ గారి స్వరకల్పన, మన పదహారణాల తెలుగబ్బాయి కారుణ్య, రమేష్ వినాయగం తో కలిసి పాడారు.
శాస్త్రి గారు మంచి గాయకులూ కూడా, సినిమాలో వాడని కొన్ని చరణాలు మా టీవీ ఇంటర్వ్యూలో వారే పాడారు అది కూడా వీక్షించండి.
అయ్యా మరొక్క సారి జన్మదిన శుభాభినందనలు.
ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ,
ఓం నమో హర నాగాభరణాయా..ప్రణవాయ,
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ..
ఓం నమో నిఠలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ,
ఓం నమో నిఠలాక్ష్యాయ, ఓం నమో భస్మాంగాయ,
ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!!
పల్లవి:
సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్ సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసీ మీదిగా,
సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా..
ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా..
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా , నీ తాపం, శాపం తీర్చేవాడేరా!!
పైపైకలా.. బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల!!
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!!
సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్..ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ..
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా!!
మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా..
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా!!
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా!!

om namashiva jai jai jai || 2 ||
om namashiva go to the trans and say jay jay
sing along sing shiv shambo all the way
om nama shiva jai jai jai heal the world is all we pray
save our lives and take our pain away jai jai
sing along sing shiv shambo all the way
సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్..ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగ..
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా కాచే దొరలాగా!!
మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా..
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా!!
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా!!
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె కొలువున్నోడు, నిన్ను దాటి పోనే పోడు!!
https://www.youtube.com/watch?v=Aq0yDPug3W0
https://www.youtube.com/watch?v=G5iTugfFvP4
https://www.youtube.com/watch?v=Pgwhpwo_XaI
No comments:
Post a Comment