మిత్రులకి వందనం
మన గ్రూప్ లో ఒక మంచి గాయకులు ఉన్నారు వారు పార్ధసారధి, మొదటి తరం పాడుతాతీయగా నుంచి వారిని ఫాలో అవుతున్నా. చాలా మంచి పాటలు పాడారు వారు (చిరు గారి కోసం బంగారం తెచ్చి) వారు పాడిన, నాకు బాగా ఇష్టమైన పాట "పుచ్చా పువ్వుల విచ్చే తావుల" అని మనోహరం సినిమా లోనిది. వేటూరి వారి అందమైన పువ్వుల వర్షం కురిపిస్తే దానికి మణిశర్మ గారు పుప్పొడి రాగాలు అద్దారు. దానికి గుణశేఖర్ గారి రంగుల అద్దకం మరింత శోభని అందించింది. చిత్రమ్మ తో కలిసి నేమాని వారు పాడిన ఈ పాట మీకోసం ఈ రోజు.
తప్పులేమైనా ఉంటే మిత్రులు సరిదిద్దగలరు
పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు
పచ్చా మీగడలిచ్చే తియ్యన తెచ్చే నీ కలలు
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా
ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే సంధ్యల్లో
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా
గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలకువ
వీణ మీటె సెలయేరు చలి వేణు ఊదే చిరుగాలి
కలువ కనులలోనా కలవరింతలాయే
చలువ తనువులోనా జలదరింతలాయే
ఓ ఓ ఓ ఓ
పిండి వెన్నెల వండి వార్చిన వెండీ ఇసకల్లో
తెల్లా మబ్బుని వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చినాయమ్మా వచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా అలజడులొచ్చినాయమ్మా
లేత పచ్చికల అణకువ నును లేత మచ్చికల తొణకవ
నిండు అల్లికల నవ నవ తలదిండు మల్లికల శివ శివ
పట్ట పగటి ఎండా పండు వెన్నెలాయే
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే
ఓ ఓ ఓ ఓ
ఊరా వాకిలి తీసే తియ్యని దొరా వయసుల్లో
మాఘామాసపు మంచు బెబ్బులి పోంచే వేళల్లో
వచ్చినాయమ్మా గిచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా వలపులు గిచ్చినాయమ్మా
https://www.youtube.com/watch?v=-rmIIVvXMB4

No comments:
Post a Comment