మిత్రులకి వందనం
చాలా చాలా రోజులైంది మిమ్ములని పలకరించి
ఈ రోజు గురువు గారు శాస్త్రి గారి జన్మదినం వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు
సిరివెన్నెల గారు ఎన్నో స్పూర్తివంతమైన పాటలని రాసినా మళ్ళీ ఇంకో కొత్త పాట రాసిన ప్రతీసారీ సరికొత్తగా "అవున్నిజమే కదా" అని మనం బుద్ధిగా తలూపేలా అలవోకగా బతుకు పాఠాలు చెప్తుంటారు. అలాంటి ఒక పాట ఇది కూడా మొదటి సినిమా కోసం రాసారు, సినిమా హిట్ కాక పొతే మరుగున పడిపోతుంది పాట అలాగే ఈ పాట కూడా చాలా కొంచెం మంది విని ఉంటారు.
ఈ పాటలోని ప్రతీ వాక్యం నిరాశా నిస్పృహల్ని తరిమేస్తూ ఉత్తేజాన్ని కలిగించేదిగా ఉంటుంది. పాటలోని భావానికి శంకర్ మహదేవన్ గళం తోడై మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.
నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!
ఎటు నీ పయనమంటే.. నిలిచేదెక్కడంటే..
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే!
ఎదలో ఆశ వెంటే.. ఎగసే వేగముంటే..
సమయం వెనుకబడదా ఊహ తన కన్నా ముందుంటే!
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా?మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ఈ ప్రశ్న?మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా!
నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా..ఒకలాగే పూర్తయ్యేనా!
కసిరే వేసవైనా.. ముసిరే వర్షమైనా..
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా!
మసకే కమ్ముకున్నా.. ముసుగే కప్పుకున్నా..
కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా!
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం..
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతి గాయం..
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!
నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!
అచ్చం ఇదే ట్యూన్లో ఇంకొక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. అది శ్రీ కుమార్ పాడారు. అది కూడా చాలా బాగుంటుంది.
చేదైనా బాధైనా.. అన్నీ మామూలే..
మేడైనా కీడైనా.. ఎన్నో కొన్నాళ్ళే..
మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే..
ఎటు వైపున్నా నీ తీరం కలిసి వస్తుందే..
https://www.youtube.com/watch?v=XeNlajen_iE
https://www.youtube.com/watch?v=dlgcP_dXV3U

No comments:
Post a Comment