Thursday, December 22, 2016

నిలువదే శతమానంభవతి

మిత్రులకి వందనం

చాలా చాలా రోజులైంది ముమ్ములని పలకరించి, కొందరు అనుకుంటూవుంటారు హమ్మయ్య వీడు ఆపాడురా అని. కానీ మంచి పాట వింటే వెంటనే మీరందరు గుర్తొస్తారు, ఈ మధ్య ఆడియో రిలీజ్ అయిన శతమానంభవతి పాటలు విన్నాక తప్పకుండా మీతో నా అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది.

దిల్ రాజు నిజంగానే మంచి దిల్ ఉన్నవారు, వారి చిత్రాలలో పాటలకి పెద్ద  పీటే వేస్తారు. వెంటేశ్వర క్రియేషన్స్ బేనర్ పైన దిల్ రాజు గారు నిర్మిస్తున్న "శతమానంభవతి" చిత్రం లో బాలు గారు పాడిన "నిలువదే" పాట భలే నచ్చేసింది, మిత్రులు చిన్న శాస్త్రి గారు (రామజోగయ్య ) గారు రాసిన ఈ పాటకి  మిక్కి జె మేయర్ సంగీతం సమకూర్చారు.

వినగానే బలుపు చిత్రంలోని బాలు గారు పాడిన "నినుచూసిన క్షణంలో" పాటలా అనిపించినా అంతకన్నా బాగుంది.

ఇక పాడిన బాలు గారి గురించి ఎం చెప్పాలి, డెబ్భైల్లో కూడా ఇంత మధురంగా ఎలా పాడగలుగుతున్నారు అనిపిస్తుంది ఈ పాట వింటే. పాటలో "పలకదే" అనే చోట బాలు గారు ఒక్కోసారి ఒక్కోలాగ అనడం, ఎంత పాషన్ తో పాట పాడతారో అనిపించింది.

ఈ తరంలో సీతారామ శాస్త్రి గారి గురించి తప్ప వేరే కవులగురించి రాయాలనిపించేది కాదు, వారి ప్రభావం అంతాగా ఉంటుంది నామీద, కానీ రామజోగయ్య శాస్త్రి గారు రాస్తున్న పాటలు కొన్ని నా ఆలోచనని మారుస్తున్నాయి, ప్రేరేపిస్తున్నాయి, ఉత్సాహపరుస్తున్నాయి, ఆనందింపచేస్తున్నాయి, అన్నిటికన్నా వినడానికి (కుమ్ముడు, దున్నుడు లాంటివి లేకుండా) చక్కటి పదాలతో, మనసుకు హత్తుకున్నట్టు రాస్తున్నారు, అయ్యా ఇంకా రాయండి మేము వింటాం, ఇల్లాంటి పాటలు వినే తెలుగు వాళ్ళం ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాం. నాకు బాగా నచ్చిన లైన్ "దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా".

మిగతా పాటలు కూడా చాలా బాగున్నాయి అందుకే జ్యూక్ బాక్స్ అంతా షేర్ చేస్తున్నా, పదాలు వినపడేట్టు శ్రావ్యయమైన సంగీతం ఇస్తున్న మిక్కీ జె మేయర్ గారి అభినందించకుండా ఉండలేం.

త్వరలోనే రిలీజ్ కాబోయే ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నా.

ఈ పాట 11:25 లో ప్రారంభం అవుతుంది.


నిలవదే మది నిలవదే
శిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడిన
కొంత మిగిలిపొయేంత
అందం నీది

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదొ లాంటి తేనల  బాణం
దిగదా ఎదలొకి

నువ్వు నడిచే దారులలొ
పూల గంధాలె ఊపిరిగా
కధ నడిచే మనసు కదే
హాయి రాగల ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన సరదా
నినువిడి మనగలదా

ఎలా నీకు అందించాలొ
ఎదలొ కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి
ఎదుటే నిలిచాను

చదువుకునే బదులిదని
చెప్పుకొలేవులే మనసా
పదములతొ పనిపడని
మౌనమే ప్రేమ పరిభాషా
తెలుపక తెలిపిన
వలపొక వరమని
కడిలిగ అలలేగసా

https://www.youtube.com/watch?v=WhEBrjlzBc4

No comments:

Post a Comment