మిత్రులకి శుభోదయం
చిరంజీవి గారి వీరాభిమానిని ఈ రోజు వారి పాట మీకు గుర్తుచెయ్యకపోతే నా అభిమానానికి అర్ధం లేదు.
పుట్టినరోజు శుభాకాంక్షలు చిరు. మీ 151 వ చిత్రం కోసం చాలా కాలంనుంచి వేచి ఉన్నాం ఎప్పుడెప్పుడా అని.
చిరంజీవి గారు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన రుద్రవీణ చిత్రం అంటే మీకందరికీ తెలిసందే నాకు పరమ ఇష్టం అని. ఆ చిత్రంలోని కొన్ని పాటలని మిత్రులకి అంతకుముందు పరిచయం చేశా, అదే చిత్రంలో చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలో శ్రీ శ్రీ గారి నేను సైతం జోడించడం పాటని మరో ఎత్తుకి తీసుకెళ్లింది, రాజా గారి సంగీతం అద్భుతం. బాలు గారితో కలిసి మనో పాడిన ఈ పాట మీకోసం ఈరోజు. అన్ని చరణాలు ఉన్న వీడియో దొరకలేదు.
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు.
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేదీ
మంచైనా చెడ్డయినా పంచుకోను నే లేనా
ఆమాత్రం ఆత్మీయతకైనా పనికి రానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది " 4 "
గుండెల్లో సూడి తిరిగే కలత కధలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వేలి వేస్తె అయినా నేనేకాకిని
పాట బాట మారాలని చెప్పడమే నానేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనే పాట పంచవన్నెల వీరి తోట
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుటా?
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట?
ఎటి పొడుగునా వసంతమొక్కటేనా కాలం?
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుమ్భవ్రిష్టి జడీలో ఇంకొకడు
మంచు వంచనకు మోడైగోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నాదేరాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన న ప్రశ్నకు అలిగే పెద్ద కోకిల
కళ్ళు వున్నా కబోదిలా
చెవులు వున్న బధిరుడిలా నూతిలో కప్పలా
బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతి తో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరి చెయ్యాలి జన గీతి వద్దనుకుంటు నాకు నేనే పెద్దనుకుంటు కలవు జీవించాను నేను కలవరింత కోరాను నేను.
నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రొస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పడలేను కొత్త బాటను వీడి పోను
నేను సైతం నేను సైతం నేను సైతం
https://www.youtube.com/watch?v=gSkwSSJV7Rg

No comments:
Post a Comment