మిత్రులకు శుభోదయం
ప్రారంభించిన మొదటిరోజే 4 మంచి పాటలతో గడిచింది నిన్న. నిస్పృహ నిరాశల నుండి బయటకు రమ్మని ప్రేరణ కలిగించే ఒక మంచి పాట చూద్దాం ఈరోజు
పట్టుదల అనే చిత్రం కోసం గురువుగారు శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ గీతాన్ని చూడండి.
youtube లో ఉన్న లింక్ కూడా చూడండి ఈ పాట గురించి నేను చెప్పడం కన్నా వారి మాటలలో చూడండి. commercial చిత్రం కాకపొతే పాట ఎలా అడుగంటి పోతుందో అనడానికి ఈ గీతం ఒక ఉదాహరణ. జేసుదాసు గారి గొంతులో కన్నా శాస్త్రి గారి గళంలో ఎందుకో నాకు నచ్చింది. ఆ భావం బాధ అయిన స్వరం లోనే కనిపించాయి.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా "2"
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశా విలసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడ అగ్నిగొళమంటిదేనురా " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "
నొప్పి లేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా "2"
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారదౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్నవరకు చావుకూడా నెగ్గలేక శెవము పైన గెలుపు చాటురా " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "
ఆఖరి లైను చూడండి ఒరిజినల్ గా సినిమాలో లేదు కాని శాస్త్రి గారికి ఆ లైన్ అంటే చాలా ఇష్టం నాకు కూడా, చాల దైర్యం కావలి ఆలా రాయాలంటే.
మీకందరికీ మరొక మంచి శుభదినం కావాలని కోరుకుంటున్నా.
ఆఖరి లైను చూడండి ఒరిజినల్ గా సినిమాలో లేదు కాని శాస్త్రి గారికి ఆ లైన్ అంటే చాలా ఇష్టం నాకు కూడా, చాల దైర్యం కావలి ఆలా రాయాలంటే.
మీకందరికీ మరొక మంచి శుభదినం కావాలని కోరుకుంటున్నా.
No comments:
Post a Comment