Sunday, April 12, 2015

ikshvaku vamsam

మిత్రులకు సుమనఃసుమాంజలి

చిన్నప్పుడు మనమందరం భాగీరధి  ప్రయత్నం గురించి చదువుకొన్నాం గుర్తున్నదా, అలాగే షట్చక్రవర్తుల గురించి చెప్పినప్పుడు సగరుడు గురించి చెప్తారు, అలాగే దీలీపుడు గురించి కూడా, వీళ్ళందరూ ఎవరో తెలుసా ఆ  శ్రీరామ చంద్రుని పూర్వజులు,  ఒక్కసారి రాముని తాతలు, ముత్తాతలు ఎవరో చూద్దాం. 

రామాయణం బాలకాండలో 70 సర్గ లో చెప్తారు వాల్మీకి మహర్షి. 

అవ్యక్తప్రభవొ బ్రహ్మా శాశ్వతొ నిత్య అవ్యయః
అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి బ్రహ్మదేవుడు జన్మించెను, అతడు శాశ్వతుడు, నిత్యుడు,నాశరహితుడు, ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను. మరిచసుతుడు కాశ్యపుడు, కాశ్యపుని వలన సూర్యుడు (వివస్వంతుడు), సూర్యుని కుమారుడు వైవస్వతమనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి, అతడు మహారాజు, మనువు పుత్రుడు ఇక్ష్వాకువు, ఈ ఇక్ష్వాకువు మొదటి అయోధ్యాపతి, ఈయన కుమారుడు కుక్షి, కుక్షి గారి సుపుత్రుడు వికుక్షి, వికుక్షి పుత్రరత్నం బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు. 


No comments:

Post a Comment