మిత్రులకి వందనం
కృష్ణవంశీ మనకున్న మంచి దర్శకులలో ఒకరు, విలువలున్న చిత్రాలను తీసారు, అందులో ఒకటి అంతఃపురం, షారుఖ్ ఖాన్, నానాపాటేకర్ లాంటి మహామహులతో రీమేక్ చేసినంత మంచి చిత్రం, ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, చిత్రమ్మ స్వరం ఇంకేం కావలి ఈ పాట చాలామందికి ఫేవరేట్ కావడానికి.
ఒక అమ్మాయి లో పరకాయ ప్రవేశం చేసినట్టు రాసారు శాస్త్రి గారు.
కొన్ని ప్రయాగాలు సరికొత్తగా ఉంటాయి ఈ పాటలో "ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ"
శాస్త్రి గారి కలానికి రెండు పాళీలు ఉన్నాయ్ అనిపించింది ఈ పాట వింటే, కొంత శృంగారాన్ని వాడారు గురువుగారు, "చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం" లాంటి ప్రయోగం
వినడానికి చాలా ఇజిగా ఉంటుంది ఈ పాట కాని పాడడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో.
ఆ "సౌందర్య"మైన నటనం మీకెందుకు అని ఆయన మాకు దూరం చేసాడు మిమ్ములని, ఇలా మళ్ళి మళ్ళి మిమ్ములని గుర్తుచేసుకుంటాం, we miss you సౌందర్య.
అసలేం గుర్తుకు రాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిముషం కూడ నిన్ను చూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నాన్నేను నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలన
గొరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చలచల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమై ఏకమయే ఏకాంతం లోకమయె వేళా
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని
కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండనీ
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హ హ కారం
మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
https://www.youtube.com/watch?v=sgMKZfdPads

No comments:
Post a Comment