జై శ్రీమన్నారాయణ
సంపుటి 4, సంకీర్తన 276
రాగిరేకు 347
రాగం : ఛాయ
పాడినవారు : గరిమెళ్ళ అనిలకుమార్ గారు.
శరణు శరణు నీకు జగదేక వందిత
కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన
ఘన రణరంగ విక్రమ దశరథ పుత్ర
వినుతామరస్తోమ వీర రాఘవ
మునులును ఋషులును ముదమునొందిరి నీవు
జననమందినందుకు జానకీరమణ
సులభ లక్ష్మనాగ్రజ సూర్యవంశతిలక
జలధిబంధన విభీషణ వరద
తలకి అసురులు పాతాళము చొచ్చిరి నీవు
కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన
ఘన రణరంగ విక్రమ దశరథ పుత్ర
వినుతామరస్తోమ వీర రాఘవ
మునులును ఋషులును ముదమునొందిరి నీవు
జననమందినందుకు జానకీరమణ
సులభ లక్ష్మనాగ్రజ సూర్యవంశతిలక
జలధిబంధన విభీషణ వరద
తలకి అసురులు పాతాళము చొచ్చిరి నీవు
విలువిద్య నేర్చితేనే విజయరామ
రావణాంతక సర్వ రక్షక నిర్మల భక్త
పావన దివ్యసాకేత పట్టణ వాస
వేవేలుగ నుతించిరి వెస హనుమంతాదులు
సేవించిరి నిన్నుచూచి శ్రీ వేంకటేశ
రావణాంతక సర్వ రక్షక నిర్మల భక్త
పావన దివ్యసాకేత పట్టణ వాస
వేవేలుగ నుతించిరి వెస హనుమంతాదులు
సేవించిరి నిన్నుచూచి శ్రీ వేంకటేశ
No comments:
Post a Comment