జై శ్రీమన్నారాయణ
సంపుటి 2, సంకీర్తన 438
రాగం : శుద్ధసావేరీ
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు
భూమిలోను చొచ్చి
సర్వభూతప్రాణులనెల్ల
దీమసాన
మోచేటిదేవుఁడ నేను
భూమిలోను చొచ్చి
సర్వభూతప్రాణులనెల్ల
దీమసాన
మోచేటిదేవుఁడ నేను
కామించి సస్యములు
కలిగించి చంద్రుఁడనై
తేమల
పండించేటిదేవుడ నేను
కామించి సస్యములు
కలిగించి చంద్రుఁడనై
తేమల
పండించేటిదేవుడ నేను
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు
వివేకమా
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
దీపనాగ్నినై
జీవదేహముల అన్నములు
తీపుల ఆరగించేటిదేవుఁడ
నేను
దీపనాగ్నినై
జీవదేహముల అన్నములు
తీపుల
ఆరగించేటిదేవుఁడ నేను
యేపున
నిందరిలోనిహృదయములోన నుందు
యేపున
నిందరిలోనిహృదయములోన నుందు
దీపింతుఁ
తలఁపుమరపై దేవుఁడ నేను
యేపున
నిందరిలోనిహృదయములోన నుందు
దీపింతుఁ
తలఁపుమరపై దేవుఁడ నేను
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు
వివేకమా
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
వేదములన్నిటిచేతా
వేదాంతవేత్తలచే
ఆది నే
నెరఁగఁదగినయాదేవుఁడను
వేదములన్నిటిచేతా
వేదాంతవేత్తలచే
ఆది నే
నెరఁగఁదగినయాదేవుఁడను
శ్రీదేవితోఁ గూడి
శ్రీవేంకటాద్రిమీఁద
శ్రీదేవితోఁ గూడి
శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుడఁను
భావించ నేను
శ్రీదేవితోఁ గూడి
శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుడఁను
భావించ నేను
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు
వివేకమా
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు
వివేకమా
అని ఆనతతిచ్చె
కృష్ణుడర్జునునితో
భజించు = కీర్తించు
దిమసాన = ధైర్యముతో , ఓజోబలముతో
దీపానాగ్ని = జఠరాగ్ని (వైశ్వానరము)
ఆది = మొదలు
పాదైనా = నెలకొన్న
No comments:
Post a Comment