రాగం కాంభోజి
పాడినవారు : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్
పొందెరుగుదునందువు భోగినందువు
పొందెరుగుదునందువు భోగినందువు
నీ-అందరు సతులకు నేనాకు మడిచిఇత్తునా
పొందెరుగుదునందువు భోగినందువు
నీ-అందరు సతులకు నేనాకు మడిచిఇత్తునా
పొందెరుగుదునందువు భోగినందువు
పొందెరుగుదునందువు భోగినందువు
ఎవ్వతెకైనా చనవిచ్చెవు మెచ్చెవు నీ-
నవ్వులకైనాను మన్నన జూచేవు
ఎవ్వతెకైనా చనవిచ్చెవు మెచ్చెవు నీ-
నవ్వులకైనాను మన్నన జూచేవు
అవ్వలి యివ్వలి నీ అంగనల వొద్దను
పవ్వళించి వుండగా నే పాదములొత్తుదునా
అవ్వలి యివ్వలి నీ అంగనల వొద్దను
పవ్వళించి వుండగా నే పాదములొత్తుదునా
పొందెరుగుదునందువు భోగినందువు
నీ-అందరు సతులకు నేనాకు మడిచిఇత్తునా
పొందెరుగుదునందువు భోగినందువు
ఏపున నెక్కడికైనా ఏగేవు దాగేవు
ఏపున నెక్కడికైనా ఏగేవు దాగేవు నీ
కోపాన నాతోనైనా మేకులు సేసేవు
ఏపున నెక్కడికైనా ఏగేవు దాగేవు నీ
కోపాన నాతోనైనా మేకులు సేసేవు
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో-
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో-
ఓపికనప్పుడు నీకూడిగాలు సేతునా
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో-
ఓపికనప్పుడు నీకూడిగాలు సేతునా
పొందెరుగుదునందువు భోగినందువు
నీ-యందరు సతులకు నేనాకు మడిచిత్తునా
పొందెరుగుదునందువు భోగినందువు
వేడుకలెండైనా పారవేసేవు
వేడుకలెండైనా పారవేసేవు నీ-
వాడికచేతలెన్నైనా వన్నె వెట్టెవు
వేడుకలెండైనా పారవేసేవు నీ-
వాడికచేతలెన్నైనా వన్నె వెట్టెవు
ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను
ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను
ఆడుచు నీతోడ నేను వాసి చూపగలనా
ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను
ఆడుచు నీతోడ నేను వాసి చూపగలనా
పొందెరుగుదునందువు భోగినందువు
నీ-అందరు సతులకు నేనాకు మడిచిత్తునా
పొందెరుగుదునందువు భోగినందువు
పొందెరుగుదునందువు భోగినందువు
No comments:
Post a Comment