జై శ్రీమన్నారాయణ
సిన్నెక్కా…..
సిన్నెక్కా…..
సిన్నెక్కా…….
విష్ణుమూర్తి దశావతారాలను జానపదశైలిలో హృద్యంగా పాడారు అన్నమయ్య, సిరుతనవ్వు అంటే చిరునవ్వు "సిన్నక్క! వీడు చిరునవ్వులు చిందిస్తున్నాడు, వీడికి భయమేలేదు చూడవే" అంటోది పల్లెపడుచు సిన్నక్కతో.
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
వెరపెరుగడు సూడవే
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
సిన్నెక్కా…..
సిన్నెక్కా…….
Uploaded
by @padmacharan
పొలుసులు చెపకుంటాయి, పోలిసుల మేనున్నవాడు ఎవరు? మశ్చ్యవతారం. బోరవీపున్నవాడు ఎవరు? కూర్మావతారం. సెలసు అనగా వరాహారం మోర అంటే ముఖం వరాహముఖమున్న వాడేవారు? వరాహవాతారం. గొలుసుల వంటి వంకరలున్న కోరలున్నవాడు ఎవరు? నరసింహావతారం.
Uploaded by @padmacharan
పొలసు మేనివాడు బోరవీపు వాడు
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా
కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే
కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా
కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
Uploaded
by @padmacharan
గట్టి పొట్టివాడెవరు? వామనావతారం. మెడమీద గొడ్డలి మోపుకున్న వాడేవారు? పరశురామావతారం. సీటకాలవాడు? నాగలిబట్టి దున్నుతున్నప్పుడు భూమిపైనా ఒక గీత ఏర్పడుతూ వస్తుంది ఆ గీతను "సీతకము" అంటారు, కాలక్రమేపి "సీటకము" గా మారింది. ఈ సీటకాలు వేసేవాడే - బలరామావతారం. తన స్త్రీని బాసి అడవిలో రాక్షసునితో యుద్ధం చేసినవాడెవరు? రామావతారం.
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా
ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే
ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా
ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
Uploaded
by @padmacharan
పిల్లనగ్రోవిపైన బింకంగా రాగాలు పలికించే జింకచూపుల వాడేవారు? కృష్ణావతారం.
భయపడకుండా కల్కి అవతారమై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడు నన్ను కూడుకున్నాడు చూడవే సిన్నక్కా అంటూ దశావతారాల పొడుపుకథలను వేసిన అన్నమయ్య చివరి అవతారాన్ని పేర్కొనేశాడు.
Uploaded by @padmacharan
బింకపు మోతల పిల్లగోవి వాడు
సింక సూపులవాడు సిన్నెక్కా
బింకపు మోతల పిల్లగోవి వాడు
సింక సూపులవాడు సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
సిన్నెక్కా…..
సిన్నెక్కా…….
సిన్నెక్కా…….
Uploaded by @padmacharan
No comments:
Post a Comment