Monday, October 26, 2015

nee navvu chependi naato

మిత్రులకి వందనం
సమయాభావం వలన మిత్రులని ఈ మద్య పలకరించలేకపోయా,

రాంగోపాల్ వర్మ తెలుగు హిందీ చిత్ర గతి మార్చాడు అనడంలో అతిశయోక్తి లేదు, ఆప్పటిదాకా ఒక మూసలో నడుస్తున్న చిత్రాల వరసని శివ చిత్రంతో మార్చాడు, తరవాత వచ్చిన అంతం నాకు శివకన్నా బాగానచ్చిన చిత్రం, R D బర్మన్ గారి సంగీతం, గురువు గారు శాస్త్రి గారి సాహిత్యం ఈ రెండిటి విలువను పెంచే బాలు గారి శ్రావ్యమైన గొంతు ఎంకావాలి ఇంత  సూపర్ హిట్ పాటకి. మిత్రులు ఒక విషయం గమనించండి ఈ పాటలో చరణాల తరువాత పల్లవి రాదు అది R D మార్క్ మ్యూజిక్

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ లాలలాలా ఓ లాలలాలా
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ
పంచేదుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అనీ

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నుదురిలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
ఆ లాలలాలా ఆ లాలాలలాలా

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో


https://www.youtube.com/watch?v=BCFFjroEKdQ

No comments:

Post a Comment