మిత్రులకి వందనం
వందేమాతరం శ్రీనివాస్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి సంగీత దర్శకుడే కాదు మంచి గాయకులు కూడా, చాలామందికి తెలియని మరో గొప్ప విషయం ఏంటి అంటే సుమారు 10 రకాల వాయిద్యాలను సునాయాసంగా వాయించగల సమర్ధుడు అయిన. జన్మతః తెలంగాణా వాస్తవ్యుడు కావడం చేత, తెలంగాణా జానపద సంగీతం మీద ఆయినకుండే మమకారం చేత ఎక్కవ చిత్రాలు ఆలాంటివి చేసారు, ఒరియ్ రిక్షా, జై బోలో తెలంగాణా, పోరు తెలంగాణా లాంటివి. ఒరియ్ రిక్షాలో "మల్లె తీగకు పందిరి వోలె" పాట శ్రోతల గుండెలొతునుతాకి ఆర్ధ్రతను కలిగించింది అనడంలో అతిశయోక్తి లేదు.
కేవలం జానపద సంగీతమే కాకుండా మంచి సంగీతానికి అవకాశం ఉన్న పాటలు కూడా చేసారు శ్రీనివాస్, స్వయవరం చిత్రంలో కీరవాణి రాగం పాట మంచి ప్రజాదరణ పొందితే, ఆ చిత్రంలోని మరో పాట "మరల తెలుపన ప్రియ" పాట నాకు బాగా ఇష్టమైన పాట. చిత్రమ్మ చేత పాడించిన ఈపాట భువనచంద్ర రచించారు. ఇక్కడ భువనచంద్ర గారి గురించి చెప్పాలి, మంచి కవి ఎల్లాంటి సన్నివేశం ఇచ్చినా రాయగలడు! రచయత రాసిన కొన్ని పాటలని పరిగణ లోకి తీసుకొని వారి గురించి మాట్లాడతాం, అది తప్పు అనేది నాభావన, ఈ పాట చూడండి ఎంత మంచి, సున్నితమైన తెలుగు పదాలతో రాసారో భువనచంద్ర గారు. తీయటి ఈ తెలుగుపదాల ఈ పాటలో చేసిన మన పదహారణాల తెలుగు పిల్ల US వెళ్ళిపోయినా ఎల్లా మరిచిపోగలం.
మరల తెలుపన ప్రియ..మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపులో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని " మరల తెలుపన"
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని
నిదుర పోనీ కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేత కాక మనసు పడే తడబాటుని "మరల తెలుపన ప్రియ.."
నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియ రాక తెలుప లేక మనసు పడే మధుర భాద "మరల తెలుపన ప్రియ.."
https://www.youtube.com/watch?v=sETIzbkAY1o
No comments:
Post a Comment