Wednesday, September 30, 2015

raa mundadugeggam

నీకు తెలియనిదా నేస్తమా 
చెంత చేరననే పంతమా 
నువ్వు నేనని విడిగా లేమని 


ఈ నా శ్వాసని నిను నమ్మించని 
విద్వేషం పాలించే దేశం ఉంటుందా 
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా 
ఉందంటే అది మనిషిది అయి ఉంటుందా 
అడిగావా భూగోళమా 
నువ్వు చూసావా ఓ కాలమా
రా ముందడుగేద్దం 
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ 
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం 

ప్రేమను మించిందా బ్రహ్మా అస్త్రమైనా 
ఆయువు పోస్తుందా అయుధమెదైనా 
రాకాసుల ముకల్లె మార్చద పిడివాదం 
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం 
సాదించేదేముంది ఈ వ్యర్ధ వినోదం 
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం 
రేపటి శిశువుకు పట్టే ఆశల స్థన్యం  
ఈ పూటే ఇంకదు అందాం
నేటి దైన్యానికి దైర్యం ఇద్దాం


అందరికి సొంతం అందాల లోకం 
కొందరికి ఉందా పొందే అధికారం 
మట్టితోటి చుట్టరికం మరిపించే  వైరం 
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం 
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం 
నీకు తెలియనిదా నేస్తమా 
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం 
చెంత చేరననే పంతమా 
కండలుగా విడదీసే ఝండాలన్ని 
తలవంచే తలపే అవుదాం 
ఆ తలుపే మన గెలుపని అందాం 

Sunday, September 27, 2015

మిత్రులకి శుభోదయం 

చాలా రోజుల తరువాత మిత్రులని కలుస్తున్నా, 

సహస్ర చంద్ర దర్శనాలను చేసుకొని సస్రాలకొద్ది పాటలు పాడిన గానకోకిల లతమ్మ జన్మదినం నేడు, తెలుగులో తక్కువ పాటలు పాడినా గుర్తుండిపోయే పాటలు పాడారు ఆమె, సుసర్ల దక్షణా మూర్తి గారి సంగీత సారద్యంలో నిదురపోరా తమ్ముడా ఆమె మొదటి తెలుగు పాట అయితే, రాజేశ్వరరావు గారి సంగీత సారద్యంలో శ్రీ వేంకటేశ ఈశ పాట కూడా పాడారు, ఇవి రెండే కాకుండా రాజా గారి సంగీతంలో ఆఖరి పోరాటం లో తెల్ల చీరకు తకదిమి పాట మనందిరికి బాగా పరిచయం ఉన్న ప్రజాదరణ పొందిన పాట. వేటూరి వారి రచన. 


https://www.youtube.com/watch?v=3XySJ-1vssc

https://www.youtube.com/watch?v=Lr2GnBjo6nM

https://www.youtube.com/watch?v=LBG4DiO1ZEo

Friday, September 18, 2015

marala telupanaa priyaa


మిత్రులకి వందనం

వందేమాతరం శ్రీనివాస్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి సంగీత దర్శకుడే కాదు మంచి గాయకులు కూడా, చాలామందికి తెలియని మరో గొప్ప విషయం ఏంటి అంటే సుమారు 10 రకాల వాయిద్యాలను సునాయాసంగా వాయించగల సమర్ధుడు అయిన. జన్మతః తెలంగాణా వాస్తవ్యుడు కావడం చేత, తెలంగాణా జానపద సంగీతం మీద ఆయినకుండే మమకారం చేత ఎక్కవ చిత్రాలు ఆలాంటివి చేసారు, ఒరియ్ రిక్షా, జై బోలో తెలంగాణా, పోరు తెలంగాణా లాంటివి. ఒరియ్ రిక్షాలో "మల్లె తీగకు పందిరి వోలె" పాట శ్రోతల గుండెలొతునుతాకి ఆర్ధ్రతను కలిగించింది అనడంలో అతిశయోక్తి లేదు.

కేవలం జానపద సంగీతమే కాకుండా మంచి సంగీతానికి అవకాశం ఉన్న పాటలు కూడా చేసారు శ్రీనివాస్, స్వయవరం చిత్రంలో కీరవాణి రాగం పాట మంచి ప్రజాదరణ పొందితే, ఆ చిత్రంలోని మరో పాట "మరల తెలుపన ప్రియ" పాట నాకు బాగా ఇష్టమైన పాట. చిత్రమ్మ చేత పాడించిన ఈపాట భువనచంద్ర రచించారు. ఇక్కడ భువనచంద్ర గారి గురించి చెప్పాలి, మంచి కవి ఎల్లాంటి సన్నివేశం ఇచ్చినా రాయగలడు! రచయత రాసిన కొన్ని పాటలని పరిగణ లోకి తీసుకొని వారి గురించి మాట్లాడతాం, అది తప్పు అనేది నాభావన, ఈ పాట చూడండి ఎంత మంచి, సున్నితమైన తెలుగు పదాలతో రాసారో భువనచంద్ర గారు. తీయటి ఈ తెలుగుపదాల ఈ పాటలో చేసిన మన పదహారణాల తెలుగు పిల్ల US వెళ్ళిపోయినా ఎల్లా మరిచిపోగలం.


మరల తెలుపన ప్రియ..మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 
కనుపాపులో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని " మరల తెలుపన"


విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని
నిదుర పోనీ కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేత కాక మనసు పడే తడబాటుని   "మరల తెలుపన ప్రియ.."


నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియ రాక తెలుప లేక మనసు పడే మధుర భాద    "మరల తెలుపన ప్రియ.."

https://www.youtube.com/watch?v=sETIzbkAY1o

Tuesday, September 15, 2015

punya bhoomi

మిత్రులకి వందనం

మన పేజి లోని యాక్టివ్ మెంబెర్ అయిన @vijay ఈ మద్య పుణ్యభూమినాదేశం నమో నమామి పాటని గుర్తుచేయ్యమన్నారు. ఏ ఆగష్టు 15కో ఏ జనవరి 26కో పెడదాం అనుకున్నా, అయిన దేశ ప్రేమకి ఒకటి రెండు రోజులు ఏంటి, ప్రతి క్షణం ప్రేమించాలి, గౌరవించాలి మనం.

శ్రీ జాలాది గారు అధ్బుతంగా రచించిన ఈ పాట అజరామరం, తెలుగు పాట ఉన్నంత కాలం నిలిచే పాట.

జాలాది గారు నాకు నచ్చే, నేను ఇష్టపడే కవులలో ఒకరు. ఆయన రాసిన ఒక లైన్ అంటే నాకు భలే ఇష్టం, చేతి వేళ్ళు కలిస్తే కళ్యాణం కాలి వేళ్ళు కలిస్తే నిర్యాణం అంటారు, అంత సింపుల్ గా రాస్తారు అందరికి అర్ధం అయ్యేట్టు.

ఈ రోజు మీకోసం అన్న NTR నటించిన సూపర్ హిట్  చిత్రం మేజర్ చంద్రకాంత్ నుంచి పుణ్యభూమి నాదేశం, MM కీరవాణి బాణిలను చేకూర్చిన KR చిత్రం ఇది. బాలు మాత్రమే పాడగలరు ఇలా. అన్న ఎన్టీఆర్ జిందాబాద్

పుణ్యభూమి నాదేశం నమో నమామి..
ధన్యభూమి నాదేశం సదా స్మరామి. ॥పుణ్యభూమి॥

నన్ను కన్న నాదేశం నమో నమామి..
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ....నా దేశం..... ॥పుణ్యభూమి॥

అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... సార్వ భౌముడు...
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ॥అడుగో॥
ఒరేయ్‌ ఎందుకు కట్టాలిరా శిస్తు,
నారు పోసావా.... నీరు పెట్టావా ....
కోత కోసావా .... కుప్పనూర్చావా....
ఒరేయ్ తెల్ల కుక్క
కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా...
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥

అదిగదిగో...అదిగదిగో... ఆకాశం భల్లున తెల్లారి
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి భానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పెనైతె
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి
మందీ మార్బలమెట్టి మరఫిరంగులెక్కిపెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందే మాతరం వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం

అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుద సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర్య భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు.
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్

గాంధీజి కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే
ధ్రువ తారల కన్నది ఈ దేశం
చరితార్ధుల కన్నది నా భారతదేశం నా దేశం ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥ 

https://www.youtube.com/watch?v=rC0g0719uBM

Thursday, September 10, 2015

raavoyi bangaari maavaa

మిత్రులకి వందనం

అప్పుడప్పుడు సినిమా పాటలే కాకుండా లలిత గీతాలు, ప్రైవేటు సాంగ్స్ కూడా పెట్టడం జరుగుతోంది, కొందరు పెద్దలు కోరుతున్నారు వారికోసం  ముఖ్యంగా @Sri  గారి కోసం,

కొనకళ్ళ వెంకటరత్నం గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు, మిత్రులు వినేఉంటారు "మొక్కజొన్న తోటలో ముసిరినచీకట్లలో" అనే జానపద గీతం అది వారు రాసినదే. చాలా గీతాలు చలచిత్రాలకి కూడా రాసారు వారు.

ఘంటసాల మాస్టారు ఆరోజుల్లో ఎన్నో ప్రైవేటు పాటలు పాడేవారు, సాలూరి రాజేశ్వరరావు గారు చేసిన ఎన్నో ప్రైవేటు సాంగ్స్ ఎంతోమంది వింటూ ఉంటారు.

కొనకళ్ళ వారు  బంగారిమావ పేరిట కొన్ని గీతాలని రచించారు, అందులో నాకు బాగా ఇష్టమైన పాట "రావోయి బంగారి మావా పాట" ఘంటసాల గారు పాడిన ఈపాటకి  రాజేశ్వరరావు గారు సంగీతం అందించారు.

రచన చూడండి ఎంత చెమత్కారంగా ఉంటుందో "అవిసి పువ్వులు రెండు అందకున్నైనాకు తుంచి నా సిగలోన తురిమి పొడువు పోదువు గాని"


పసిడి పొల్లలొ పల్లె పడుచు తనమావ కోసం కలవపడుతూ ఇలా పిలుస్తోంది!

రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయి "2"
నీళ్ళతూరాలవెన్క నిలుచున్న పాటనే "2"
జల జలల్ విని గుండె ఝల్లుమంటున్నాది   "రావోయి బంగారి మావా"
అవిసి పువ్వులు రెండు అందకున్నైనాకు
తుంచి నా సిగలో తురిమి పోదువు గాని   "రావోయి బంగారి మావా"
ఏటి పడవ తరంగు పాట గిరికీలలో
చెలి కాడ మన వగలు కల బోసుకుందాం  "రావోయి బంగారి మావా"

https://www.youtube.com/watch?v=Cz3af36H23g



శ్యామ సుందరుడు నల్లని వాడు, కాని  పద్మ నయనంబుల వాడు అని, కృపా రసంబు తమపై  పడాలని ఆ గిరిరాజ పుత్రి వస్తూ ఆ మేరు పర్వత వెలుగులు తెచ్చి ఆ పెద్ద పెద్ద కళ్ళలో వెలుగులు నింపింది, అంతేనా ఆ సుందరుడి సాహచర్యంతో "ప్రదీప్త"మైన "పూర్ణిమా" కాంతులు నింపింది. ఆ పూర్ణిమా నిశలకు ప్రశాంతుడు చల్లని తోడై, వీడని నీడై, ప్రవరుడై, ప్రచేతుడయ్యాడు, అంతటితో ఆగిందా మరి ప్రదీప్త కాంతులు శ్రీధరమై సుమధురమై అమేయమై ఈరోజు అవ్యయమైన ఆనందాన్ని ఇచ్చింది. 

ఆ ఆనందం కలకాలం నిలవాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నా.

Monday, September 7, 2015

jeevitam sapta saagara teeram

మిత్రులకి శుభోదయం

నాకు బాగా ఇష్టమైన గాయకురాలు ఆశా భోస్లే, తెలుగులో  చాలా గేయాలను ఆలపించారు, ఆల్మోస్ట్ అన్ని హిట్సే, నేడు ఆ మహాగాయకురాలి జన్మదినం.

తెలుగు ఆమె పాడిన అశ్వమేధం చిత్రంలోని శీతాకాలం ప్రేమకు అలాగే చిన్ని కృష్ణుడు చిత్రం లోని జీవితం సప్త సాగర గీతం నాకు చాల ఇష్టమైన పాటలు.

ఆమె కొన్ని అన్నమయ్య కీర్తనలు కూడా పాడారంటే నమ్ముతారా, youtube లో చూడండి ఉన్నాయి.

వేటూరి వారు రచించిన ఈ R D బర్మన్ గారి పాటని బాలుతో కలసి ఆశ చేత  జంధ్యాల గారు పాడించారు.

వేటూరి వారు చూడండి ఎంత గొప్ప రచయతో, మనదేశంలోని కలకత్తా గురించి, కాశి గురించి రాసారంటే ఒకే, వేరే దేశం అందులోని గోప్పతనాలగురించి, నిజంగా గ్రేట్. R D మ్యూజిక్ సింప్లీ సూపర్బ్, రాసిన పాటకి ట్యూన్ కట్టడం జరిగింది అనుకుంటా.



తరా..రారా..రరా తరరా... జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కల ఇల కౌగిలించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కల ఇల కౌగిలించే చోట ఏది భువనం ఏది గగనం తారతోరణం ఈ చికాగో సియర్స్ టవరు యె స్వర్గ సోపానము ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలొ ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము హే..  బ్రహ్మ మానస గీతం...ఊ.. మనిషి గీసిన చిత్రం ....ఊ.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కలా ఇలా కౌగిలించే చోట ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యొతులు ఐక్యరాజసమితి లోన కలిసే జాతులు ఆకాశన  సాగిపోయే అంతరిక్షాలు.. ఈ మియామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము హే.. సృష్టికే ఇది అందం దృష్టికందని దృశ్యం .. కవులు రాయని కావ్యం కృషి ఖుషీ సంగమించే చోట కృషి ఖుషీ సంగమించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కలా ఇలా కౌగిలించే చోట

https://www.youtube.com/watch?v=bQraEyMBDPI

Sunday, September 6, 2015

nene raadhanoyi

మిత్రులకి శుభోదయం

1925లో ఇదేరోజున జన్మించిన భానుమతి గారు నేటికి తొమ్మిది పదులు పూర్తి చేసుకున్నారు, నటిగానే కాకుండా, గాయని, సంగీత దర్శకురాలు, రచయత్రి,  దర్శకురాలిగా, నిర్మాతగా ఇలా అన్ని రంగాలలో భహుముఖ ప్రజ్ఙాశాలి అమె.

నిన్ననే కన్నయ్య పుట్టినరోజు జరుపుకున్నాం, అంతా మన మంచికే అనే చిత్రంలో ఆమె పాడిన నేనే రాధనోయి పాట అంటే నాకు ప్రాణం, ఎంత అద్భుతంగా అలపించారో. సత్యం గారు చేసిన ఈ గీతం దాశరధి గారు రచించారు.

ఎక్కడో చదివా ఆమె ఆరోజులలో కర్ణాటిక శాస్త్రీయ సంగీత కచేరీలు M S గారితో కలిసి చేసారని, దానిబట్టి ఆలోచించండి ఎంత గొప్ప గాయనో ఆమె. అంతే కాదు తోడూ నీడ చిత్రంలో doris day అనే ఇంగ్లీష్ పాట పాడి వైవిధ్యాన్ని చూపారు.




https://www.youtube.com/watch?v=VRkLYaxmaaA

https://www.youtube.com/watch?v=nUSLdY4mL4Q

Wednesday, September 2, 2015

happy happy birthdaylu

మిత్రులకి వందనం

ఈ రోజు PK గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు, తనకంటూ ఒక విలక్షణత తెచ్చుకున్న మంచి నటుడు మంచి మనిషి pK.

వచ్చిన కొత్తల్లో చేసిన సుస్వాగతం చిత్రంలోని హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు సాంగ్ బాగుంటుంది, సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఈ SA రాజకుమార్ గారి ఈ పాట మనో జయచంద్రన్ పాడారు.

హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది
అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా

తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్
బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే
ఎదురే చూస్తోంది
ప్రేమకథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు నీకు
సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా

నింగిలోని చుక్కలనే
చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురేలేదనమా
నేల విడిచి సామైతే
టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే
విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తే ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే
పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండ
లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ

హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది
అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ ఓ ఓ
హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా


https://www.youtube.com/watch?v=Jw7UK-9_Bdc