జై శ్రీమన్నారాయణ
రాగం : శుద్థసావేరి
సంపుటి 2, సంకీర్తన 164
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్
చాటెద నిదియే సత్యము సుండో
చేటులే దితని సేవించినను
హారినొల్లని వా రసురులు సుండో
సురలీతని దాసులు సుండో
పరమాత్ముడితడే ప్రాణము సుండో
మరుగక మరచిన మరి లేదికను
వేదరక్షకుడు విష్ణుడు సుండో
సోదించె శుకుడు అచ్చుగ సుండో
ఆది బ్రహ్మగన్నాతడు సుండో
ఏదెస వెదకిన ఇతడే ఘనుడు
ఇహ పర మొసగను ఈతడే సుండో
వహి నుతించె పార్వతి సుండో
రహస్య మిదియే రహి శ్రీ వేంకట
మహీధరంబున మనికై నిలిచె
అన్నమయ్య శ్రీ వేంకటాద్రిని అధిరోహించి తాను కనుగొన్న సత్యాన్ని లోకానికంతటికీ ఎలుగెత్తి చాటుతున్నాడు! రెండు చేతులతో మనలందర్ని ఆ కొండపైకి ఆహ్వానిస్తూ ఇదిగో వినండి ఇదియే సత్యము కలియుగ రహస్యాన్ని మీ అందరికీ వెల్లడి చేస్తున్నాను, వేదరక్షకుడైన విష్ణుదేవుడు మనందరికీ ప్రాణాధారుడు ఇహపరాలను అనుగ్రహించేవాడు కలియుగంలో శ్రీ వేంకటాద్రిపై మనకు మనుగడగా నిలిచి ఉన్నాడు కాబట్టి రండి ఆ దేవుని సేవించండి తరించండి అంటున్నాడు అన్నమయ్య ఆశ్రితజనపాలకుడు , సత్యస్వరూపుడైన శ్రీ వేంకటేశ్వరుణ్ని సేవించి తరిద్దాం
No comments:
Post a Comment