Saturday, February 11, 2017

ఆనందం ఎంతో ఆనందం

మిత్రులకు వందనం

ఇప్పటి తెలుగు చిత్ర సీమలో ఉన్న సంగీత దర్శకులలో చెవులకి శబ్దం వినపడేట్టు, హృద్యమైన సంగీతాన్ని ఇచ్చే, ఇవ్వగలిగే వారు కీరవాణి గారు ఒక్కరే.

ఈ మధ్య విడుదలైన ఓం నమో వేంకటేశాయ చిత్రంలోని అన్ని పాటలు ఎంతో ఆహ్లాదంగా, చెవులకి ఇంపుగా ఉన్నాయి. నాకైతే అన్ని పాటలు బాగా నచ్చేసాయి కానీ శరత్ సంతోష్, శ్వేతా పండిట్ తో కలిసి పాడిన ఆనందం ఎంతో ఆనందం పాట భలే నచ్చేసింది.

నిన్న కాక మొన్న చిన్న పిల్లడు నుదుటున చక్కగా నామం పెట్టుకుని (నేను సిగ్గు పడుతున్నా నేనుకూడా పెట్టుకోవలిసిన నామాన్ని పెట్టుకోలేకపోతున్నందుకు) అన్ని టీవీళ్ళలోనూ పాడిన ఆ చిన్నకుర్రాడు నేడు నాగార్జున గారికి అది రాఘవేంద్రరావు చిత్రానికి పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది, సోదరా చాలా చక్కగా, శ్రావ్యంగా, శబ్దం వినపడేట్టు పాడవు, నీకు శతమానం భవతి. ఇంకా మంచి పాటలు పాడాలి, మేము వినాలి. ఇదే చిత్రంలో శ్రీనిధి పాడిన బ్రహ్మోత్సవ బ్రహ్మానందం పాట వినండి ఎంత స్పష్టంగా పాడిందో, కీరవాణి గారు ఇల్లా మన తెలుగు వారిచేత పాడించి, మంచి గాయని గాయకులని పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు.

ఆనందం పాట చంద్రబోస్ గారు రాసారునుకుంటా, కొన్ని చోట్ల వేదవ్యాస్ గారు రాసారని చెప్తున్నారు, కానీ కాదనుకుంటా, శరత్ క్లారిఫై చెయ్యగలరు.



ఆనందం
ఎంతో ఆనందం
ఎంతో ఆనందం
ఆనందం
ఎంతో ఆనందం
ఎంతో ఆనందం...

అమ్మాయల్లే పుట్టడమన్నది చాలాఆనందం
అందంగానే ఎదగడమన్నది ఇంకా ఆనందం
అందాలన్నీ అమ్మాయైతే చాలా ఆనందం
ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం
ఆశలు దీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయానందం
చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం
కాస్త ఆనందం కాదు అది శాశ్వతా అనందం

ఒకసారైనా నువ్వు కనపడితే నయనానందం
ఒక్కమాటైనా పలికావంటే శ్రవణానందం
ఒక అడుగైనా నాతొ వేస్తే అమితా   ఆనందం
ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం
లేఖలు అన్ని శుభలేఖలైతే
అడుగులు అన్నీ ఏడడుగులైతే


సిగలో పూలే పిలుపందిస్తే పుష్పాఆనందం
గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం
పెదవులు కలిసి ముద్దయి పొతే శబ్దానందం
నిదరే కానీ నిదరే పొతే శయనానందం
ఒకరికి ఒకరే గురువై పొతే
ఒడి బడి ఓలే ఒకటైపోతే



https://www.youtube.com/watch?v=AFWz8uF0m9U




No comments:

Post a Comment