Saturday, February 25, 2017

అతివలు అంటే అలుసా నీకు

నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మకి, అమ్మ తరువాత అమ్మలా నన్ను చూసిన అక్కకి, వీరువురిని ఒక్క రూపాన చూపిన నా భార్యకి, నన్ను ప్రశంసించి, ప్రేరేపించి, నన్ను నాకు పరిచయం చేసిన ఎందరు స్త్రీ మూర్తులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ ప్రపంచ మహిళా దినోత్సవ శుభసందర్భముగా వారి కోసం, ఎందరో అమ్మలకోసం నేను రాసుకున్న ఈ ప్రయత్నం మీకోసం. తప్పులుంటే క్షమించండి. మార్పులు చేర్పులు తెలియచేయండి.

మరొక సారి అందరి తల్లులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఈ కళ మీ చలవ నాన్నగారు

అతివలు అంటే అలుసా నీకు
అణిచే గుణమే పోదా నీకు

మగువలు అంటే తగవెందులకు
మృగముగ మారుట తగునా నీకు

తనువులు ఒకటై మనలో సగమై
మనరూపంబును కడుపున మోసీ
మరుజన్మెత్తీ భూమికి తెచ్చే  
తీరని ఋణమే వరమౌ కాదా "2"                      అతివలు అంటే అలుసా నీకు


ఆలన పాలన అన్నీ తానై పెంచే మొక్కను తుంచేవా
అలుపు సోలుపు ఎరుగని అమ్మలు మనలో ఒకరని  మరచేవా
కళలకు కాణాచి  నడతకు నెలవు
విలువల మాగాణి సిరులకి తరువు
తొలి గురువనునది మరిచేవా
తొందరపాటును చూపేవా  "2"                          అతివలు అంటే అలుసా నీకు



పగలు రేయి తేడా లేక శ్రమనే నమ్మే గుణవతిరా
ఇంటా బయటా ఒర్పుల నేర్పుతొ విజయ పధాన సాగెనురా
శెలవులు లేని జీతం రాని
పదవులు లేని పరపతి కొరని
మహనీయతనే మరచెదవా
దురహంకారము చూపెదవా  "2".                         అతివలు అంటే అలుసా నీకు






Saturday, February 11, 2017

ఆనందం ఎంతో ఆనందం

మిత్రులకు వందనం

ఇప్పటి తెలుగు చిత్ర సీమలో ఉన్న సంగీత దర్శకులలో చెవులకి శబ్దం వినపడేట్టు, హృద్యమైన సంగీతాన్ని ఇచ్చే, ఇవ్వగలిగే వారు కీరవాణి గారు ఒక్కరే.

ఈ మధ్య విడుదలైన ఓం నమో వేంకటేశాయ చిత్రంలోని అన్ని పాటలు ఎంతో ఆహ్లాదంగా, చెవులకి ఇంపుగా ఉన్నాయి. నాకైతే అన్ని పాటలు బాగా నచ్చేసాయి కానీ శరత్ సంతోష్, శ్వేతా పండిట్ తో కలిసి పాడిన ఆనందం ఎంతో ఆనందం పాట భలే నచ్చేసింది.

నిన్న కాక మొన్న చిన్న పిల్లడు నుదుటున చక్కగా నామం పెట్టుకుని (నేను సిగ్గు పడుతున్నా నేనుకూడా పెట్టుకోవలిసిన నామాన్ని పెట్టుకోలేకపోతున్నందుకు) అన్ని టీవీళ్ళలోనూ పాడిన ఆ చిన్నకుర్రాడు నేడు నాగార్జున గారికి అది రాఘవేంద్రరావు చిత్రానికి పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది, సోదరా చాలా చక్కగా, శ్రావ్యంగా, శబ్దం వినపడేట్టు పాడవు, నీకు శతమానం భవతి. ఇంకా మంచి పాటలు పాడాలి, మేము వినాలి. ఇదే చిత్రంలో శ్రీనిధి పాడిన బ్రహ్మోత్సవ బ్రహ్మానందం పాట వినండి ఎంత స్పష్టంగా పాడిందో, కీరవాణి గారు ఇల్లా మన తెలుగు వారిచేత పాడించి, మంచి గాయని గాయకులని పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు.

ఆనందం పాట చంద్రబోస్ గారు రాసారునుకుంటా, కొన్ని చోట్ల వేదవ్యాస్ గారు రాసారని చెప్తున్నారు, కానీ కాదనుకుంటా, శరత్ క్లారిఫై చెయ్యగలరు.



ఆనందం
ఎంతో ఆనందం
ఎంతో ఆనందం
ఆనందం
ఎంతో ఆనందం
ఎంతో ఆనందం...

అమ్మాయల్లే పుట్టడమన్నది చాలాఆనందం
అందంగానే ఎదగడమన్నది ఇంకా ఆనందం
అందాలన్నీ అమ్మాయైతే చాలా ఆనందం
ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం
ఆశలు దీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయానందం
చిట్టి ఆనందం కాదు అది సృష్టి ఆనందం
కాస్త ఆనందం కాదు అది శాశ్వతా అనందం

ఒకసారైనా నువ్వు కనపడితే నయనానందం
ఒక్కమాటైనా పలికావంటే శ్రవణానందం
ఒక అడుగైనా నాతొ వేస్తే అమితా   ఆనందం
ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం
లేఖలు అన్ని శుభలేఖలైతే
అడుగులు అన్నీ ఏడడుగులైతే


సిగలో పూలే పిలుపందిస్తే పుష్పాఆనందం
గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం
పెదవులు కలిసి ముద్దయి పొతే శబ్దానందం
నిదరే కానీ నిదరే పొతే శయనానందం
ఒకరికి ఒకరే గురువై పొతే
ఒడి బడి ఓలే ఒకటైపోతే



https://www.youtube.com/watch?v=AFWz8uF0m9U




Monday, January 16, 2017

నీరు నీరు నీరు

మిత్రులకి వందనం

చిరంజీవి గారి 150 చిత్రం వస్తోందని నాలాంటి చాలామందికి పండగే, గత కొన్ని రోజులనుంచి ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేస్తూ వస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ, వింటున్నా కానీ పంచుకునేంత డెప్త్ కనిపించలేదు,వినిపించలేదు, ఇది పాట అంటే అనిపించింది నిన్న సాయంత్రం విడుదల చేసిన "నీరు నీరు నీరు" పాట
.
రోజు రోజు కీ మీకు పెద్ద అభిమానిని చేసేస్తున్నారు రామజోగయ్య గారు, గుండెలు పిండేశారు, లహరి వారి గ్రాఫిక్స్ మసకబారిపోయాయి కళ్ళెవెంట ధారలు ఆగకున్నాయి,

కొన్ని ఎక్సప్రెషన్స్ అద్భుతంగా రాశారు

" నీటి పైన ఆశే నీరు గారి పోయే "

అలాగే, మనం దాహంగాఉంది అంటాం, దాహమాగటంలేదు అంటాం

పాటలో  "దాహమారు"తుందా (దాహం ఆరుతుందా) అంటారు శాస్త్రి గారు, గొప్ప ఆలోచన.

" నేలతల్లి నేడు అంగిలారి పోయే ", గొంతు కోసుకుంది ఆకలి, చాలా చాలా బాగా రాశారు.

అయ్యా ఇంకా మంచి పాటలు రాయాలి మీరు.

శంకర్ మహదేవన్ గళం ఆద్రంగా పలికించారు దేవిశ్రీ ప్రసాదుగారి సంగీత పర్యవేక్షణలో

రాఘవాచారి గారు మీకు నచ్చచ్చు ఈ పాట, శాండిల్య చిరంజీవి గారిని మేము కొందరం ఇలా చూస్తాం,



నీరు నీరు నీరు రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరు
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు
ఆదరించు నాధుడెవ్వరు
అన్నదాత గోడు నింగినంటే నేడు
ఆలకించు  వారు  ఎవ్వరూ

గొంతు ఎండి పోయే పేగు మండిపోయే
గంగ తల్లి జాడ లేదని
నీటి పైన ఆశే  నీరు గారి పోయే
రాతమారు దారిలేదని
దాహమారుతుందా పైరు పండుతుందా
ధారలైన కంటి నీటి తో

నేల తల్లి నేడు
అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలి
ఆయువంత చూడు
ఆర్తనాదమాయి
గొంతు కోసుకుంది ఆకలి

https://www.youtube.com/watch?v=1UO2khEUUx4




Tuesday, January 10, 2017

బృందావనమాలి

మిత్రులకి

వందనం

ఈ రోజు శ్రీమాన్ యేసు దాసు గారి జన్మదినం, ఈ రోజు వారి పాట గుర్తు తెచ్చుకోకపోతే ఎలా, మన తెలుగు వారికి ఎక్కవగా వారి పాటలని వినగలిగే భాగ్యం  మోహనబాబు గారి వలననే కలిగిందని చెప్పాలి, ప్రతి సినిమా లోని ఒక్క పాటైనా వారు పాడాలిసిందే.

అల్లుడుగారు - ముద్దబంతి పువ్వులో , నగుమోము, కొండలలో నెలకొన్న 
అసంబ్లీరౌడీ - అందమైన వెన్నెలలోనా
మేజర్ చంద్ర కాంత్ - ముద్దులతో ఓనమాలు నేర్పించనా
చిట్టెమ్మ మొగుడు  - చినుకు రాలితే
పెద్ద రాయుడు - కదిలే కాలమా
సోగ్గాడి పెళ్ళాం - కొండా కోన పాలైనా
కలక్టర్ గారు - ఎంత  మంచి వాడివయ్యా
రౌడీగారి పెళ్ళాం - కుంతీ కుమారి

ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయ్.

నాకు బాగా ఇష్టమైన జొన్నవిత్తులగారి సాహిత్యం లో వచ్చిన ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచిన బృందావనమాలి పాట , తప్పు చేసి పప్పు కూడు చిత్రం లోనిది దాసు గారితో చిత్రమ్మ గళం కలిపిపారు గ్రేసీ సింగ్ కోసం.

మొదటిసారి విన్నప్పుడు సీత రామ శాస్త్రి గారి రచన అనుకున్నా, ఎందుకంటే కన్నయ్య మీద ఆయన అన్ని మంచి పాటలు రాశారు.

ఆనందించండి.



బృందావనమాలి రా రా మా ఇంటికి ఒక సారి
అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి  కొంటే అల్లరి

వెన్నెల ముగ్గుల దారులువేసిదందుకేరా
వీణలు, గోలలు, మాయలు, నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా

సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వెయ్యాలి
మెరుపుల తీగలతో బుజాలే చనువుగా కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుకులు  చూపాలి
పద పద మంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టే కొల్లగొట్టి పోరా
పరవశమౌతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
ముద్దుల జాణా ముందుకు రాగా మీగడ బుగ్గల మిక్కిలి నోచగా

స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి
యమునా కెరటంలా నువ్వే నా ఎదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకి ఇవ్వాలి
గిల గిల మంటూ పొన్నచెట్టు మీద ఉన్న చీరలందుకోరా
గల గల మన్న గాజులున్న కన్నె చేతి వెన్న ముద్ద లీనా
మీటగా రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగా పువ్వులు ఇవ్వగ


https://www.youtube.com/watch?v=bgZ-MhlGD5w