Saturday, May 28, 2016

ఏ చిలిపి కళ్ళలోన కలవో

మిత్రులకి వందనం

గౌతమ్ మీనన్ మనకి బాగా తెలిసిన పరభాషా దర్శకుడు, కొన్ని డైరెక్ట్ తెలుగు చిత్రాలు కూడా తీసారు రీమేక్ అయినా సరే, అందులో ఒకటి వెంకటేష్ గారి ఘర్షణ, తమిళంలో కాక్కా కాక్కా గా సూర్య జ్యోతిక చేస్తే, ఇక్కడ అసిన్ దగ్గుపాటి వారి తో చేసారు.

సోదరుడు కులశేఖర్ ఈ చిత్రానికి పాటలు మాటలు కూడా రాసారు. హరీష్ జయరాజ్ సంగీతం. చెప్పాలంటే పాటలన్నీ బాగుంటాయి. అన్నిటికంటే నాకు ఏ  చిలిపి కళ్ళలోన కలవో పాట అంటే మరీ ఇష్టం. శ్రీనివాస్ చాలా బాగా పాడారు.

ఈ పాటలో జడ కుచ్చుల్లోన్నా మల్లెవొ  అనడం తప్పని ఒకసారి ఓ T V ప్రోగ్రాం లో ఒక కావిగారు అన్నారు. కుచ్చు జడ కొసన ఉంటుంది కదా అక్కడ మల్లెలెలా పెట్టుకుంటారని వారి అభిప్రాయం. కాని నేను ఎందుకో వారితో ఏకిభవించ లేక పోతున్నా, ఉత్తర ఆంధ్రా ప్రాంతంలో జడ కుచ్చు తీసుకోవడం అనే వాడుక ఉంది, జడ కొసని కట్టుకునే వాటిని కుప్పెలని వాడుక. పెద్దలెవరైనా ఇంకొంత వివరణ ఇవ్వగలరు.

ఏమైనా ఒక మంచి పాట ఇచ్చాడు సోదరుడు, అన్నా నువ్వు మళ్ళి రావాలి, నీ ప్రతాపం చూపాలి. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా.


ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో (2)

ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం
స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నువ్వు నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో (2)
కరిమబ్బుల్లోనా విల్లువో మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో (2)

https://www.youtube.com/watch?v=iaYRWdQxjLI&spfreload=5

Monday, May 23, 2016

మౌనమే ప్రియా ధ్యానమై

మిత్రులకి వందనం

ఈ మధ్య  స్నేహితుడు నాగేశ్వరరావు (నాని గారు) కామెంట్ లో చిన్నికృష్ణుడు చిత్రం లోని మౌనమే ప్రియ పాట ప్రస్తావన తెచ్చారు, నిజంగానే జానకమ్మ పాడిన ఈ పాట కూడా చాలా బాగుంటుంది. పంచం దా (R D Burman ) సంగీతం అపురూపం అజరామరం. వేటురిగారు రాసారని మళ్ళి చెప్పాలా?


మౌనమే ప్రియా ధ్యానమై  
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా  ధ్యానమై  
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా ధ్యాన్నమై 

చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు 
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు 
వెన్నెలలో కాగే తారా మందారాలు 
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ 
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయే 
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో 

మౌనమే ప్రియా ధ్యానమై 
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 

కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు 
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు 
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు 
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు 
వచ్చే మాఘమాసం పందిరేసి ముందుగానే 
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ 
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో 

మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ 
మౌనమే ప్రియా  ధ్యానమై 
మౌనమే ప్రియా  ధ్యానమై 

https://www.youtube.com/watch?v=xj5Xr_xgC5g

వేణువై వచ్చాను భువనానికి

మిత్రులకి వందనం

నిన్నటికి సరిగ్గా 6 సంవత్సరాలు మహానుభావులు శ్రీమాన్ వేటూరి సుందరరామ్మూర్తి గారు మనల్ని విడిచి.

1974 లో శ్రీ శ్రీ గారి తరువాత ఇరవై సంవత్సరాలకి వేటూరి గారు మాతృదేవోభవ చిత్రానికి నేషనల్ అవార్డు మనకి అందించారు " రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి. అదే చిత్రంలోని వేణువై వచ్చాను భువనానికి పాట నాకు బాగా ఇష్టం, ఈ పాటతో వారిని మరొక్క సారి గుర్తు చేసుకుందాం, చిత్రమ్మ గొంతు ఎంతో ఆద్రతతొ వినిపిస్తుంది. కీరవాణి గారి సంగీతం ఇంకేం కావాలి ఒక మంచి పాటకి.

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

https://www.youtube.com/watch?v=W4yM7Wk1zRc

https://www.youtube.com/watch?v=jzTMSbJbmUg

Friday, May 20, 2016

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా.

మిత్రులకి వందనం

చాలా చాలా రోజులైంది మిమ్ములని పలకరించి

ఈ రోజు గురువు గారు శాస్త్రి గారి జన్మదినం వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు

సిరివెన్నెల గారు ఎన్నో స్పూర్తివంతమైన పాటలని రాసినా మళ్ళీ ఇంకో కొత్త పాట రాసిన ప్రతీసారీ సరికొత్తగా "అవున్నిజమే కదా" అని మనం బుద్ధిగా తలూపేలా అలవోకగా బతుకు పాఠాలు చెప్తుంటారు. అలాంటి ఒక పాట ఇది కూడా మొదటి సినిమా కోసం రాసారు, సినిమా హిట్ కాక పొతే మరుగున పడిపోతుంది పాట అలాగే ఈ పాట కూడా చాలా కొంచెం మంది విని ఉంటారు. 

ఈ పాటలోని ప్రతీ వాక్యం నిరాశా నిస్పృహల్ని తరిమేస్తూ ఉత్తేజాన్ని కలిగించేదిగా ఉంటుంది. పాటలోని భావానికి శంకర్ మహదేవన్ గళం తోడై మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.


నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

ఎటు నీ పయనమంటే.. నిలిచేదెక్కడంటే..
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే!
ఎదలో ఆశ వెంటే.. ఎగసే వేగముంటే..
సమయం వెనుకబడదా ఊహ తన కన్నా ముందుంటే!
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా?మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ఈ ప్రశ్న?మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా..ఒకలాగే పూర్తయ్యేనా!

కసిరే వేసవైనా.. ముసిరే వర్షమైనా..
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా!
మసకే కమ్ముకున్నా.. ముసుగే కప్పుకున్నా..
కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా!
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం..
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతి గాయం..
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

అచ్చం ఇదే ట్యూన్లో ఇంకొక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. అది శ్రీ కుమార్ పాడారు. అది కూడా చాలా బాగుంటుంది. 

చేదైనా బాధైనా.. అన్నీ మామూలే..
మేడైనా కీడైనా.. ఎన్నో కొన్నాళ్ళే..
మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే..
ఎటు వైపున్నా నీ తీరం కలిసి వస్తుందే.. 
https://www.youtube.com/watch?v=XeNlajen_iE


https://www.youtube.com/watch?v=dlgcP_dXV3U

తనువులు మాయ

తనువులు మాయ తలపోసి తలపోసి
చెప్పెదనంటినా కర కరల మొహమిది
ఆశల పాషనంబిది అతుకుల జల్లెడ ఇది
తన బ్రతుకు కొరకు పోరాడి పోరాడి
యురులన్ చెరచెడు దుర్గంధంబు డొంక ఇది
నీరు బుగ్గ ఊట చెలమ
తూట్ల బాన తొడరి దుర్గంధమున గోలుచును
మాటలే కాని మరి యందును పసలేదు
నోటను  మురికి దంతముల పాచి
నాసికమున ఊళే నయనంబున పీళే
చెవిలోన గుల్మి చెట్టలకొంప
మూటకట్టుకున్న మలమూత్రముల తిత్తి
చీము నెత్తుటి జడి పురుగుల జలదారి
చిచ్చుట రోత పైత్యపు గోళా
పైగల పంచారంబిది తోలు గప్పిన డోలు సుమ్మిది
నమ్మిక లేదు నమ్మికలేదు నాటకములు ఆడెను బూటకముల బొమ్మా "2"
అమ్మ అమ్మా ఈ బొమ్మా
స్వామి సింహగిరి నరహరి నమో నమో దయానిధి.....