Friday, March 20, 2015

మన్మదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మిత్రులందరికీ మన్మదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మున్నూట అరవైఅయిదు రోజులు నిరుడు "జయమే" కొందరికి విజయాలు వరిస్తే కొందరికి అపజయాలు చరిచాయి "మరుభూమియందైన మేరువునందైన వర్షం ఒక్కలాగే కురుస్తుంది" కదా అలాగే "వెన్నల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా" అన్నట్టు కాలానికి అంతా సమానమే, కాకపొతే కొందరికి మంచి కొందరికి చెడు జరగడం సహజం, మంచిని ఎలా అస్వాదిస్తామో అలానే చెడు జరిగినప్పుడు హమ్మయ్య ఇంకా చెడు కాకుండా ఇంతటితో సరిపోయింది అని అనుకోగలిగితే అది కూడా మంచిదే.
ఇక రాబోయేది 'మన్మథ' నామ సంవత్సరం...మనసులను చలింపచేసే సంవత్సరం .. ! అంటే, మనసు వికారాన్ని పొంది - స్త్రీ లౌల్యం వైపు పరుగు తీయడం కాదు .. .. సమాజంలో జరిగే దుష్కృత్యాలపై - మనసు చలించాలి ... మనప్రక్క మనతో బాటుగా మెలిగే వారికి ఆపద కలిగితే - మనసు చలించాలి .... మనతో బాటుగా సాహచర్యం చేసేవారికి బాధ కలిగితే - మనసు చలించాలి .. వీలయితే వారికి ఒకింత సహాయపడగలగాలి.. తప్ప, సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించకూడదు . "సమాజం - సమాజం " అంటూ దేన్నో చూపిస్తున్నాం -నువ్వూ , నేనూ-మనమంతా కలిస్తేనే కద 'సమాజం'. అంతా, మనమంతా సుమనస్కంగా ఉంటే ..,ఎవరిమటుకు వారు మంచి మనసులు కలవారైతే .. సమాజమంతా సుమనోహరంగా ఉంటుంది . సమాజం మనోహరమైతే .. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ 'మన్మథ' లో మనమంతా సుమనస్కంగా మెలగాలని .. నతమస్తకంతో ... ఉగాది శుభాకాంక్షలు..


No comments:

Post a Comment