Saturday, March 21, 2015

శ్రీరామ నవమి

రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కదాః
రామభూతం జగద్బృద్రామే రాజ్యం ప్రశాసతి
అంటారు ఆదికావ్యం రామయణంలొ శ్రీ రామ పట్టాభిషేక సర్గలొ శ్రీ వాల్మికి మహర్షి. దాని అర్ధం ఆగ్లంలో చూడండి.

While Rama ruled the kingdom, the talks of the people centered round Rama, Rama and Rama. The world became Rama's world.

అంతా రమమయం ఈ జగమంతా రమమయం అని రామదాసు గారు అందుకే అన్నారు, పది వేల సంవత్సరాలు రాముడు రాజ్యం పరిపాలించాడని చెప్తారు.

మా సోదరుడు కులశేఖర్ ఇలా అంటాడు తన రామరస వాహిని లో : ఇతి బాధలతో ఆటు పోటులతో సతమతమౌతు సంసారాన్ని ఎట్లా ఈదాలి దానికి చిట్కా కావాలి రాముని కధలే చదవాలి అని.

ఈ రోజు శ్రీరామ నవమి, రాముని స్మరిస్తే చాలు సకల పాపాలు పోతాయి అంటారు, రామనామం అంత గొప్పది. మనం కూడా ఏదో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

రామాయణంలొ 6 కాండలని 6 మొక్ష మార్గాలుగా చెప్తారు.

అ. బాలకాండ : భక్తి మార్గములొ ముందుకు పొయినకొలది మీ మనస్సు బాలుని వలె ఉండవలెను.
     మీ జ్ఞానము, గౌరవము, ధనము పెరిగినప్పటికీ మనస్సు మాత్రం బాలకుని వలే ఉండవలెను అని చెప్పకనే            చెబుతుంది.
ఆ . అయోధ్య కాండము: ఎవరి మనసు బాల కాండ వలే శుభ్రముగా ఉండునో, ఎవరి శరీరము అయోధ్య అయినదో.       ఎక్కడ యుద్ధము, పోట్లాట, విరోధము, పరస్పర వాదోపవాదములు,దుర్బుద్ధి లేదో అదే అయోధ్య కాండ. కైకేయి       మనస్సులో దుర్బుద్ధి కలిగింది కాబట్టే రాముడు అయోధ్య విడిచి వెళ్ళాడు.
ఇ . అరణ్య కాండము: గృహస్తుని గృహము కామానికి పుట్టినిల్లు, భొగలాలస భక్తిని కలుగనివ్వదు.    
      సీతారామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉండగా రాముడు అన్నం తినలేదట, ఫలములు మాత్రమే
      తీసుకున్నాడట, అన్నములో రజోగుణము ఉంటుందని అందువలన కామము జనించునని అందువలన
      సాత్విక ఆహారము తీసుకొనుటచేత ఇంద్రియములు వసములొ ఉండునట. అరణ్య వాసమప్పుడు రామునికి
      26 సంవత్సరాలు, సీతమ్మకి 18 సంవత్సరాలు, ఎంత నిగ్రహం తో ఉన్నారండి వారు.
ఈ. కిష్కింద కాండము : రామునికి సుగ్రీవునితో స్నేహం కుదిరింది, మనుష్యునకు విషయానందంపైన మక్కువ
     ఉన్నంతవరకు బ్రహ్మానందం కల్గదు. గీతలో భగవంతుడు, కామము క్షణికసుఖము మాత్రమే అంటారు. చీకటి
     వెలుతురూ ఒక్కచోట ఎలా ఉండవో అలాగే రాముడు కామము ఒక్కచోట ఉండవు. రాముడు రక్షించిన
     వారెవ్వరు, ఎప్పుడూ కామాంధులు కాలేరు.  శ్రీమన్నారాయనుడే ప్రేమించ దగిన వాడు. ఆయనతో
     సహవాసము చేసిన జీవితము ఆనందమగును.
ఉ. సుందరకాండ: సుందరమైనది సుందరకాండ అంటారు. ఈ సుందరకాండ లో అన్ని శౌర్య కధలే. హనుమ
     సముద్రం దాటుట సీతమ్మని కలవడం అన్ని వీర శౌర్య ఘట్టాలే. జీవితంలో సత్భ్రమ్హచర్యమ్ పాటిస్తూ రామనామ
     బలం కలిగి ఉన్న వారు మాత్రమే ఈ భవసాగరం దాటగలరు.
ఊ . యుద్దకాండ: కామము క్రోధము మోహము లోభము అనేవి రాక్షసులు. ఈ దుర్గుణములు పోనంతవరకు
       భక్తిని  పొందలేరు. సాదారణ మనుష్యులు భక్తి కలిగి ఉండటమే ఈ దుర్గుణములను దూరము చేసికొనుటకు
       ఉపాయము.

రామాయణం విన్నా చదివినా చాలు అన్ని సక్రమంగా జరుగుతాయి.

మీకందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.




Friday, March 20, 2015

మన్మదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మిత్రులందరికీ మన్మదనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మున్నూట అరవైఅయిదు రోజులు నిరుడు "జయమే" కొందరికి విజయాలు వరిస్తే కొందరికి అపజయాలు చరిచాయి "మరుభూమియందైన మేరువునందైన వర్షం ఒక్కలాగే కురుస్తుంది" కదా అలాగే "వెన్నల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా" అన్నట్టు కాలానికి అంతా సమానమే, కాకపొతే కొందరికి మంచి కొందరికి చెడు జరగడం సహజం, మంచిని ఎలా అస్వాదిస్తామో అలానే చెడు జరిగినప్పుడు హమ్మయ్య ఇంకా చెడు కాకుండా ఇంతటితో సరిపోయింది అని అనుకోగలిగితే అది కూడా మంచిదే.
ఇక రాబోయేది 'మన్మథ' నామ సంవత్సరం...మనసులను చలింపచేసే సంవత్సరం .. ! అంటే, మనసు వికారాన్ని పొంది - స్త్రీ లౌల్యం వైపు పరుగు తీయడం కాదు .. .. సమాజంలో జరిగే దుష్కృత్యాలపై - మనసు చలించాలి ... మనప్రక్క మనతో బాటుగా మెలిగే వారికి ఆపద కలిగితే - మనసు చలించాలి .... మనతో బాటుగా సాహచర్యం చేసేవారికి బాధ కలిగితే - మనసు చలించాలి .. వీలయితే వారికి ఒకింత సహాయపడగలగాలి.. తప్ప, సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించకూడదు . "సమాజం - సమాజం " అంటూ దేన్నో చూపిస్తున్నాం -నువ్వూ , నేనూ-మనమంతా కలిస్తేనే కద 'సమాజం'. అంతా, మనమంతా సుమనస్కంగా ఉంటే ..,ఎవరిమటుకు వారు మంచి మనసులు కలవారైతే .. సమాజమంతా సుమనోహరంగా ఉంటుంది . సమాజం మనోహరమైతే .. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ 'మన్మథ' లో మనమంతా సుమనస్కంగా మెలగాలని .. నతమస్తకంతో ... ఉగాది శుభాకాంక్షలు..


Wednesday, March 11, 2015

కాలాన్ని కరిగించేలా

కాలాన్ని కరిగించేలా కదలికలన్నీ ఉన్నాయంటే కాలాన్నే ఆపేయాలని ఉన్నదమ్మా
దూరాన్ని పెంచే తరుణం ముంగిలిలోకి వచ్చిందంటే దూరాన్నే దూరం చేద్దాం కూనలమ్మ

సుడిగాలి అయినా సుడిగుండమైన సంసార సాగరాన్ని ఈదలమ్మా సాగాలమ్మా
పిడివాదులైన  అవివేకులైన మనపక్కే తిప్పాలమ్మా ఒర్పులతో నేర్పులతో  "కాలాన్నే కరిగించేలా "

నీ ఉహా లోకం నీ స్వప్న లోకం
మనసున దాచిన దాగున దాహపు దప్పికదీ
నీ కంటి దీపం నీ ఇంటి రూపం
వెలుగుల వాగులాగా సాగాలమ్మ సాగాలమ్మ
నలుదిక్కులు వెలుతురు నువ్వే పంచాలమ్మా పంచాలమ్మా
కలలును తీర్చుకో మార్చుకో ఓర్పుతొ నేర్పులతో  " కాలాన్నే కరిగించేలా " 

Saturday, March 7, 2015


కార్యేషు దాసీ కరణేషు మంత్రి
భోద్యేషు మాత  శయనేషు రంభ
రూపేషు లక్ష్మి క్షమయేషు ధరిత్రి
షట్ ధర్మయుక్త  కులధర్మ పత్ని

అంటారు   నీతిశాస్త్రం లో బెద్దన గారు,

మనకన్నా పాతిక ముప్పై  సంవత్సరాల ముందు పుట్టిన అమ్మ మనల్ని కనడం కోసం మళ్ళి తనువు చాలించి ఇంకొక జన్మ ఎత్తుతుందిట ఆ అమ్మలందిరికి
అమ్మ ఇంటిలో ఊపిరి సలపని పని ఒత్తిడి లో ఉంటే మనల్ని తాయారు చేసి అక్కలందరికి
వయసు లోకి వచ్చాక వివాహ భందం పడ్డాక పైన చెప్పిన అన్ని పాత్రలు ఎంతో సమర్దవంతం  పోషించే మీకందరికీ
ఈ లక్ష్ములందరికి మీకందరికీ   ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 


ఓ మహిళ!
ధర్మం - అర్ధం - కామం అనే పురుషార్ధ సాధనకి నీవు సాధనం ..
గృహనీతి అనే విద్యకి నీవు నెలవు,
నిర్మలమయిన శీలాన్ని ప్రబోధించే గురుస్థానీయురాలు ..వంశం నిలవటానికి ఆధారభూతమయినది ...
ఉత్తమగతులు కలగటానికి ఊతకర్ర అయినది ...
గౌరవింపబడటానికి ముఖ్యహేతువు ...ఆదర్శప్రాయములు...నీవు....  కలకాలం నిలచివుండేవీ అయిన..సుగుణాలకు నెలవైనది ...
భర్తకు హృదయానందాన్ని కలిగించేది ...
మగనికి ఇల్లాలికంటే ఇంపైనది వేరొకటిలేదు.
ఆలుబిడ్డలను ఆప్యాయనంగా చూచేవారికి... ఏచోటైనా,
ఎటువంటి పరిస్థితులలోనైనా, ఎటువంటి ఆపదలలోనైనా,
ఏ తీరాలలోనైనా ఆవరించివున్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి.
యాత్ర నార్యంతు పూజ్యంతే, రమంతే తత్ర దేవత అన్నట్టు మిమ్ములని పూజిస్తాం గౌరవిస్తామ్ ప్రేమిస్తాం  మీకందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు