Thursday, August 25, 2016

alokaye sri bala krishnam

మిత్రులకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాభినందనములు

కన్నయ్య ని ఎంతమంది ఎన్ని రకాలుగా కొలిచారో కదా, విచిత్రంగా కన్నయ్య మీద ఎవరు పాట కానీ పద్యం కానీ, శ్లోకం కానీ ఏమి రాసినా అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అది కన్నయ్య లీలే అంటా.

నారాయణ తీర్థులవారి ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఎంత హృద్యంగా ఉంటుందో, శ్రీమాన్ విశ్వనాధ్ గారు వారి శృతిలయలు చిత్రం కారణంగా చాలామందికి (కామన్ పీపుల్ ) ఈ పాట గురించి తెలిసిందనే చెప్పాలి. వాణీజయరాం గళంలో మరింత శ్రావ్యంగా ఉంటుంది ఈ మహదేవన్ గారి స్వరకల్పన.

విశ్వనాధ్ గారి వలన, వారి చిత్రాలవలన తెలుగు వారికి ఇల్లాంటి సంగీత నృత్య సంబందిత చిత్రాలని, పాటల్ని చూసే అవకాశం కలిగింది.

ఏలూరు వాస్తవ్యులు శ్రీమాన్ కొరడా సత్యనారాయణ గారి దగ్గర శిష్యరికం చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారి.

చిత్రంలో వాడని 3 చరణాలని మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది, తప్పులుంటే పెద్దలు దిద్దగలరు.

మీకందరికీ మరోసారి కన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు.

ఈ పాట చూసి మీ పిల్లలని వెంటనే కన్నయ్యలుగా, రాధమ్మలా చేసెయ్యండి, భలేవుంటారు కదా,  నేను వెళ్ళాలి ఇంటికి మా బలరామ కృష్ణులని తయారుచేయాలి.


ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే||
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణమ్ 
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ 
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనమ్ అఖండ విభూతి కృష్ణమ్ 
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్ 
నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ 
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్ 
వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ 
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్ 
నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ 

https://www.youtube.com/watch?v=VNnnt2_uD9E

Wednesday, August 24, 2016

sadasiva sanyasi

మిత్రులకి వందనం 

నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది సీతారామశాస్త్రి గారు కాకుండా ప్రస్తుతం ఉన్న కవివర్యులు సందర్భానుసారంగా పాటలు రాయగలరా అని, కానీ ఆ లోటు శ్రీమాన్ దరివేముల రామజోగయ్య శాస్త్రి గారు తీరుస్తున్నారు. అయ్యా మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. వారి శిష్యరికం చేసిన వారందరు మంచి కవులే మీకులా. వారి లక్షణాలు మరింత అలరచుకుంటారని మరిన్ని మంచి సాహిత్యమున్న పాటలు  మాకు అందిస్తారని కోరుతున్నాం. నాకు తెలిసి రెండుభాషలలో పాటలు రాసింది వీరేనేమో, రాజశ్రీ గారు తమిళం తెలుగు రెండు భాషలలో రాసారని విన్నా కానీ కాన్ఫిర్మ్ కాదు. RJS గారు తెలుగులో రాయడానికి ముందు కన్నడంలో పాటలు రాశారు. అయ్యా ఏమైనా తప్పులుంటే తెలియజేయగలరు. 

వీరిని కూడా శాస్త్రి గారు అని పిలవడం భలే గా ఉంది, నా భాషలో శాస్త్రి గారంటే సీతారామ శాస్త్రి గారే అని మిత్రులు నవ్వుతూ ఉంటారు. 

ఈ చిన్న శాస్త్రి గారు మనందరికీ సదాశివ సన్యాసి పాటతో బాగా దగ్గరయ్యారు. ఈ రోజు మీకోసం ఈ పాట మహేష్ ఖలేజా నుంచి. మణిశర్మ గారి స్వరకల్పన, మన పదహారణాల తెలుగబ్బాయి కారుణ్య, రమేష్ వినాయగం తో కలిసి పాడారు. 

శాస్త్రి గారు మంచి గాయకులూ కూడా, సినిమాలో వాడని కొన్ని చరణాలు మా టీవీ ఇంటర్వ్యూలో వారే పాడారు అది కూడా వీక్షించండి. 

అయ్యా మరొక్క సారి జన్మదిన శుభాభినందనలు. 


ఓం  నమో శివ రుద్రాయ, ఓం నమో శితి కంఠాయ, 
ఓం నమో హర నాగాభరణాయా..ప్రణవాయ, 
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ..
ఓం  నమో నిఠలాక్ష్యాయ, ఓం  నమో  భస్మాంగాయ, 
ఓం నమో  హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ!!

పల్లవి:
సదాశివా  సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్ సూపుల సుక్కాని  దారిగా,  సుక్కల తివాసీ మీదిగా,
సూడ సక్కని సామి దిగినాడురా.. ఏసైరా ఊరు వాడా దండోరా..

ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు  జంగమ శంకర శివుడేనురా..
నిప్పు గొంతున  నీలపు మచ్చ సాచ్చిగా , నీ తాపం, శాపం తీర్చేవాడేరా!!
పైపైకలా.. బైరాగిలా, ఉంటాదిరా ఆ లీల!!

లోకాలనేలేటోడు  నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె  కొలువున్నోడు, నిన్ను దాటి పోనే  పోడు!!

om namashiva jai jai jai  || 2 ||
om namashiva go to the trans and say jay jay
sing along sing shiv shambo all the way
om nama shiva jai jai jai heal the world is all we pray
save our lives and take our pain away jai jai 
sing along sing shiv shambo all the way

సదాశివా సన్యాసి, తాపసి కైలాసవాసి..
నీ పాదముద్రలు మోసి, పొంగి పోయినాదె పల్లె కాశి..
ఏయ్..ఎక్కడ వీడుంటే  నిండుగా, అక్కడ నేలంతా పండగ..
సుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా, అడుగేశాడంటా  కాచే దొరలాగా!!

మంచును, మంటను ఒక్క తీరుగా, లెక్కసెయ్యనే సెయ్యని శంకరయ్యగా..
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా.. మనకండ దండ వీడే నికరంగా!!
సామీ అంటే హామీ  తనై ఉంటాడురా చివరంటా!!

లోకాలనేలేటోడు  నీకు సాయం కాకపోడూ..
ఏయ్.. నీలోనె  కొలువున్నోడు, నిన్ను దాటి పోనే  పోడు!!
        



https://www.youtube.com/watch?v=Aq0yDPug3W0

https://www.youtube.com/watch?v=G5iTugfFvP4


https://www.youtube.com/watch?v=Pgwhpwo_XaI

Monday, August 22, 2016

cheppalani undi gontu vippalani undi

మిత్రులకి శుభోదయం

చిరంజీవి గారి వీరాభిమానిని ఈ రోజు వారి పాట మీకు గుర్తుచెయ్యకపోతే నా అభిమానానికి  అర్ధం లేదు.

పుట్టినరోజు శుభాకాంక్షలు చిరు. మీ 151 వ చిత్రం కోసం చాలా కాలంనుంచి వేచి ఉన్నాం ఎప్పుడెప్పుడా అని.

చిరంజీవి గారు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన రుద్రవీణ చిత్రం అంటే మీకందరికీ తెలిసందే నాకు పరమ ఇష్టం అని. ఆ చిత్రంలోని కొన్ని పాటలని మిత్రులకి అంతకుముందు పరిచయం చేశా, అదే చిత్రంలో చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలో శ్రీ శ్రీ గారి నేను సైతం జోడించడం పాటని మరో ఎత్తుకి తీసుకెళ్లింది, రాజా గారి సంగీతం అద్భుతం. బాలు గారితో కలిసి మనో పాడిన ఈ పాట మీకోసం ఈరోజు.  అన్ని చరణాలు ఉన్న వీడియో దొరకలేదు.

మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు.


ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేదీ
మంచైనా చెడ్డయినా పంచుకోను నే లేనా
ఆమాత్రం ఆత్మీయతకైనా పనికి రానా
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది " 4 "
గుండెల్లో సూడి తిరిగే కలత కధలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వేలి వేస్తె అయినా నేనేకాకిని

పాట బాట మారాలని చెప్పడమే నానేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనే పాట పంచవన్నెల వీరి తోట

బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుటా?
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట?

ఎటి పొడుగునా వసంతమొక్కటేనా  కాలం?
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుమ్భవ్రిష్టి జడీలో ఇంకొకడు
మంచు వంచనకు మోడైగోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నాదేరాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన న ప్రశ్నకు అలిగే పెద్ద కోకిల
కళ్ళు వున్నా కబోదిలా
చెవులు వున్న బధిరుడిలా నూతిలో కప్పలా
బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయెను నా  స్థానం

అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి  సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతి తో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరి చెయ్యాలి జన గీతి వద్దనుకుంటు నాకు నేనే పెద్దనుకుంటు కలవు జీవించాను నేను కలవరింత కోరాను నేను.


నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రొస్తాను
నేను సైతం ప్రపంచాజ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని  శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పడలేను కొత్త బాటను వీడి పోను
నేను సైతం నేను సైతం నేను సైతం

https://www.youtube.com/watch?v=gSkwSSJV7Rg