Tuesday, November 10, 2015

deepavali

మిత్రులకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి అంటే?  దీప + ఆవళి = దీపావళి

ఆవళి అంటే వరుసా అని అర్ధం. దీపాలవరుస అని పూర్తి అర్ధం.

దశకంఠుని దునుమాడిన ఆ శ్రీరామ చంద్రమూర్తి సీత లక్ష్మణ సేమేతంగా అయోధ్యకు తిరిగి వస్తు ఉంటే, అరిషడ్వర్గమ్ముల బాపి జ్ఞానజ్యోతి వెలిగించెను మన మనసులలో అని నగరమంతా దీపాలతో అలంకరించారట అయోధ్య వాసులు.

సత్యాకృష్ణులు కలిసి నరకునితో పోరు సలిపి వానిని తుదముట్టించి మన ఎడదల వెలుగునింపారని ద్వారకానగారాన్ని సూర్యుడు కూడా క్రిందకి తొంగిచూసేట్టు వెలుగులతో నింపారట ద్వారకా వాసులు
ఈ రెండు జరిగి కొన్ని వేల సంవత్సారాలు అయినా మనం మరువలేదు, దీపావళి చేస్తున్నాం అంతర్యం అసలుకే మరిచిపోయి. దశకంఠుడు - నరకుడు వీరు  అసురులా? మనలమించు అసురుడెవడు..?మన ఎడదల అసురసంధ్య -తొలగించే దెవరో ..? ఈరోజు మనం దాని అర్థాన్నే మార్చేసి బాంబుల పండుగ చేసేసాం. మోతలు మ్రోగిన్చేస్తున్నాం, కాలుష్యం తో నింపేస్తూన్నాం, పక్షి, జంతు, జన జీవనానికి హానికలిగించేస్తున్నాం. కొన్ని వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలని ఈ భూమాత కడుపులోకి తోక్కేస్తున్నాం. ప్రాణాలకి హాని కలిగించేట్టు పండుగ చేసుకోమని ఎవరు చెప్పారు. మన పండుగ మీద కూడా చైనా వారు డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎంత దుర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మనం. ఎందుకు ఈ పండుగ జరుపుకోవాలో మీ పిల్లలకి చెప్పండి, నాకు తెలిసిన మా చిన్నప్పుడు చెప్పిన కధలని మీతో పంచుకోవాలని కోరికతో ఈ చిన్ని ప్రయత్నం.

ఈ భూమండలం, కాదు ఈ మొత్తం సౌరమండలంలో ఉండే అన్ని జీవరాసులు సుఖంగా ఉన్నరోజేకదా, అపుడే కదా  మనకు అసలు -నిజమైన దీపావళి .. ..!!!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

No comments:

Post a Comment