దీపావళి వస్తోంది అంటే భయమేస్తోంది, సంవత్సరం సంవత్సరానికి బాంబుల మోతతో, కాలుష్యం పెరుగుతోందే తప్ప ఈ దివ్వెల పండుగ, ఈ వెలుగుల పండుగ, ఈ అంధకారాన్ని ప్రాలదొలే పండుగ ఆనందాన్ని ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం కేవలం ఈ ఒక్కరోజు కొన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్తని, కొన్ని వేల క్యూబిక్ మీటర్ల రసాయన పొగని మనం వదులుతున్నాం. నునే దీపాలు వెలిగించవలసిన పండుగ కాస్తా బాంబుల పండుగగా మారుతోంది. మీరు ఆలోచించ లేని మరొక విషయాన్ని ఒకటి చెప్తా, మనలో కొందరు శ్వాస సంభదిత ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు, అల్లాంటి వారికి ఎంత ఇబ్బంది కలుగుతోందో తెలుసా, ఆఖరికి వారు ఈ పండుగనాడు, తరువాత కొన్ని రోజుల పాటు బయటకు రాలేకపోతున్నారు అంటే నమ్ముతారా, ఆఖరికి వారు ఆ రోజు కృత్రిమ శ్వాస ఇచ్చే యంత్రాలతో గడుపుతున్నారు అంటే నమ్ముతారా. అంతే కాదు ఎన్నో పక్షులు చనిపోతున్నాయి ఆ శబ్ధాలకి. మిత్రులకి ఒక మనవి పండుగ చేసుకోకండి అని చెప్పడం లేదు, సమాజానికి, సంఘానికి, మనతోటి వారికి ఇబ్బంది లేకుండా, నునే దీపాలతో, లైట్స్ తో, మిఠాయిలతో, కొత్త బట్టలతో జరుపుకోండి. మీకందిరికి దీపావళి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment