Monday, November 30, 2015

man ko shakti dena

మిత్రులకి వందనం

ఎవరో అడుగుతున్నారు నన్ను ఏంటి పాటల సరదా తీరిపోయిందా, ఈ మద్య పోస్టలు లేవు అని, కేవలం సమయాభావం వలన మాత్రమే రాయలేక పోతున్నా, సంగీతం మీద, సాహిత్యం మీద మోజు ఎప్పటికి పోదు, మిత్రులతో పంచుకోవడంలో ఉండే ఆనందం బాగా తెలిసినవాడిని.

సమయాన్ని కూడగట్టుకొని మరి ఈ రోజు ముందుకొచ్చా!

సప్తతి మహోత్సవం జరుపుకుంటున్న మహా గాయని శ్రీమతి వాణిజయరామ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు దశాభ్దాలకు పైగా ఎన్నో గొప్ప పాటలు పాడి మనల్ని అలరిస్తున్న వాణి గారు, తెలుగులోనే కాకుండా భారతీయ భాషలన్నిటి లోను పాడారు.

గుడ్డి చిత్రం గురించి నిన్నటి తరం వారందరికీ తెలుసు వసంత్ దేశాయి గారి సంగీత సారద్యంలో వచ్చిన ఆ డెబ్బైవ దశకం చిత్రంలోని హంకో మన్ కి శక్తి దేన పాట ఆ రోజులలో ప్రతి పాఠశాలలో ప్రార్ధనా గీతంగా నడిచేది. ఇప్పటికి ఉత్తర భారతంలో చాలా  పాఠశాలల్లొ పిల్లలు పాడతారు.

వాణి గారు భారతదేశంలో ఉన్న అందరు గొప్ప సంగీత దర్శకులకి పాడారు, చిత్రగుప్త, నౌషద్, మదన్ మోహన్, op నయ్యర్, R D బర్మన్, కళ్యాణ్ జి-ఆనంద్ జి, జయదేవ్, సలీల్ చౌదరి,లక్ష్మి కాంత్ ప్యారేలాల్, రవీందర్ జైన్, లాంటి హిందీ సంగీత దర్శకులు, M S విశ్వనాధన్, మహదేవన్, M K అర్జున్, ఇళయరాజా, A R రెహమాన్ లాంటి దక్షిణ భారత సంగీత దర్శకుల దగ్గరా కూడా పాడారు.

ఆమె పాడిన మీరా భజన్స్ వినండి తన్మయత్వం చెందడం ఖాయం.

ఎంతైనా ఆమె వీణ విద్వాంసులు శ్రీ రంగారామనుజం అయ్యంగారి శిష్యురాలు, అక్కగారితో పాటు కడలూరు  శ్రీనివాస అయ్యంగార్ దగ్గరా సంగీతం అభ్యసించారు.


हम को मन की शक्ति देना, मन विजय करे
दूसरों की जय से पहले, खुद को जय करे

भेदभाव अपने दिल से साफ़ कर सके
दोस्तों से भूल हो तो माफ़ कर सके
झूठ से बचे रहे, सच का दम भरे
दूसरों की जय से पहले, खुद को जय करे

मुश्किलें पड़े तो हम पे इतना कर्म कर
साथ दे तो धर्म का, चले तो धर्म कर
खुद पे हौसला रहे, बदी से ना डरे
दूसरों की जय से पहले, खुद को जय करे


https://www.youtube.com/watch?v=a0VhLqzPqVA

Tuesday, November 10, 2015

deepavali

మిత్రులకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి అంటే?  దీప + ఆవళి = దీపావళి

ఆవళి అంటే వరుసా అని అర్ధం. దీపాలవరుస అని పూర్తి అర్ధం.

దశకంఠుని దునుమాడిన ఆ శ్రీరామ చంద్రమూర్తి సీత లక్ష్మణ సేమేతంగా అయోధ్యకు తిరిగి వస్తు ఉంటే, అరిషడ్వర్గమ్ముల బాపి జ్ఞానజ్యోతి వెలిగించెను మన మనసులలో అని నగరమంతా దీపాలతో అలంకరించారట అయోధ్య వాసులు.

సత్యాకృష్ణులు కలిసి నరకునితో పోరు సలిపి వానిని తుదముట్టించి మన ఎడదల వెలుగునింపారని ద్వారకానగారాన్ని సూర్యుడు కూడా క్రిందకి తొంగిచూసేట్టు వెలుగులతో నింపారట ద్వారకా వాసులు
ఈ రెండు జరిగి కొన్ని వేల సంవత్సారాలు అయినా మనం మరువలేదు, దీపావళి చేస్తున్నాం అంతర్యం అసలుకే మరిచిపోయి. దశకంఠుడు - నరకుడు వీరు  అసురులా? మనలమించు అసురుడెవడు..?మన ఎడదల అసురసంధ్య -తొలగించే దెవరో ..? ఈరోజు మనం దాని అర్థాన్నే మార్చేసి బాంబుల పండుగ చేసేసాం. మోతలు మ్రోగిన్చేస్తున్నాం, కాలుష్యం తో నింపేస్తూన్నాం, పక్షి, జంతు, జన జీవనానికి హానికలిగించేస్తున్నాం. కొన్ని వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలని ఈ భూమాత కడుపులోకి తోక్కేస్తున్నాం. ప్రాణాలకి హాని కలిగించేట్టు పండుగ చేసుకోమని ఎవరు చెప్పారు. మన పండుగ మీద కూడా చైనా వారు డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎంత దుర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మనం. ఎందుకు ఈ పండుగ జరుపుకోవాలో మీ పిల్లలకి చెప్పండి, నాకు తెలిసిన మా చిన్నప్పుడు చెప్పిన కధలని మీతో పంచుకోవాలని కోరికతో ఈ చిన్ని ప్రయత్నం.

ఈ భూమండలం, కాదు ఈ మొత్తం సౌరమండలంలో ఉండే అన్ని జీవరాసులు సుఖంగా ఉన్నరోజేకదా, అపుడే కదా  మనకు అసలు -నిజమైన దీపావళి .. ..!!!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

Monday, November 9, 2015

దీపావళి వస్తోంది అంటే భయమేస్తోంది, సంవత్సరం సంవత్సరానికి బాంబుల మోతతో, కాలుష్యం పెరుగుతోందే తప్ప  ఈ దివ్వెల పండుగ, ఈ వెలుగుల పండుగ, ఈ అంధకారాన్ని ప్రాలదొలే పండుగ ఆనందాన్ని ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం కేవలం ఈ ఒక్కరోజు కొన్ని వేల మెట్రిక్ టన్నుల చెత్తని, కొన్ని వేల క్యూబిక్ మీటర్ల రసాయన పొగని మనం వదులుతున్నాం. నునే దీపాలు వెలిగించవలసిన పండుగ కాస్తా బాంబుల పండుగగా మారుతోంది. మీరు ఆలోచించ లేని మరొక విషయాన్ని ఒకటి చెప్తా, మనలో కొందరు శ్వాస సంభదిత ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు, అల్లాంటి వారికి ఎంత ఇబ్బంది కలుగుతోందో తెలుసా, ఆఖరికి వారు ఈ పండుగనాడు, తరువాత కొన్ని రోజుల పాటు బయటకు రాలేకపోతున్నారు అంటే నమ్ముతారా, ఆఖరికి వారు ఆ రోజు కృత్రిమ శ్వాస ఇచ్చే యంత్రాలతో గడుపుతున్నారు అంటే నమ్ముతారా. అంతే కాదు ఎన్నో పక్షులు చనిపోతున్నాయి ఆ శబ్ధాలకి. మిత్రులకి ఒక మనవి పండుగ చేసుకోకండి అని చెప్పడం లేదు, సమాజానికి, సంఘానికి, మనతోటి వారికి ఇబ్బంది లేకుండా, నునే దీపాలతో, లైట్స్ తో, మిఠాయిలతో,  కొత్త బట్టలతో జరుపుకోండి. మీకందిరికి దీపావళి శుభాకాంక్షలు.

Monday, November 2, 2015

itu itu

మిత్రులకి వందనం

ఒక గాలి శీను, ఒక కేబుల్ రాజు, ఒక బళ్ళారి బాబు, ఒక ధూపాటి హరిబాబు. ఇలా సినిమా లోని కారెక్టర్ పేరు గుర్తు పెట్టుకునేంత గొప్పగా కధ రాసుకొని తియ్యడం కేవలం జాగర్లమూడి క్రిష్ కి మాత్రమే చెల్లింది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న మంచి దర్శకులు కృష్ణవంశి, త్రివిక్రమ్ శ్రీనివాస్,  శ్రీకాంత్ అడ్డాలా, కొరటాల శివ, జాగర్లమూడి క్రిష్. వీరి అయిదుగురికి కామన్ పాయింట్ ఒకటుంది, అదేంటంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వీరికి పెద్ద ప్రేరణ. శాస్త్రి గారు కేవలం గేయ రచయత మాత్రమే కాదు ఒక గొప్ప philosopher, ఒక గొప్ప హ్యూమన్బీయింగ్. సినిమాలో సందర్భానుసారమును బట్టి పాట రాయగల ఏకైక కవి.

క్రిష్ గారి నూతన చిత్రం కంచె గురించి చెప్పాలి. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, మంచి చిత్రాన్ని ప్రేక్షకులకి అందించడం ఒక బాధ్యత గా భావించి చిత్రాలని తెరకెక్కిస్తారు క్రిష్. వరుణ్ మొదటి చిత్రమే గొప్ప కధా చిత్రాన్ని  ఎంచుకొని, రెండవ చిత్రానికి ఇంకో మెట్టెక్కి కధ తో పాటు గొప్ప కారెక్టర్ ఉన్న చిత్రాన్ని, దర్శకుడిని ఎంచుకున్నారు. నిజంగా చాలా అభినందనీయులు. మెగా ఫ్యామిలీ మూసలో పడకుండా జాగ్రత్త పడుతున్నారేమో అనిపించింది.

ఈ చిత్రంలో ఒక  పాట బాగుంది అనడానికి లేదు, ఒక పాటను మించి ఒకటి ఉంది. చిరంతన్ భట్ మంచి సంగీతాన్ని అందించారు. శాస్త్రి గారు విద్వేషం పాలించే దేశం ఉంటుందా విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తారు, అలాగే ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం రేపటి శిశువుకు పట్టె ఆశల స్థన్యం ఈ పూటే ఇంకదు అందాం నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం అంటారు. ఎవరు రాయగలరండి, ఎవరు రాయించుకుంటున్నారండి ఎవరో ఒకరో ఇద్దరో తప్ప. ఈ చిత్రంలోని ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివివో చూద్దాం. మొదటి చరణం తరువాత interload, హిందుస్తానీ రాగాలాపన వినండి ఎంత మాధుర్యంగా ఉందొ, అభయ్ జోద్పుర్కర్ తో కలిసి శ్రేయ ఘోసాల్ పాడారు, శ్రేయ గాడ్ బ్లెస్ యు 

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో  ఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగాతమందో
ఇల్లంటివేమ్ తెలియక ముందే మనం అనే కధానికా మొదలైందో


ఒక్కొక రోజుని ఒక్కొక గడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందో సమయం కనపడక
ప్రమంచామంతా పరాభవంతో తలలోంచి వెళిపొదా
తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్న మెలకువలొ ఉన్నాం కదా
మన దరికి ఎవరు వస్తారు కదిలించగ
ఉషస్సెలా  ఉదయిస్తుందో నిశీదెలా ఎటు పోతుందో
నిదుర ఎపుడు నిదరవుతుందో
మొదలు ఎపుడు మొదలవతుందో

పెదాలు మీదగా అదేమీ గలగల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మధురిగా
ఇల్లాంటి వీలు కి ఇల్లాంటి ఊసులు ప్రపంచ భాష కదా
ఫలానా అర్ధం అనేది తెలిపే నిఘంటువు ఉండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగ



https://www.youtube.com/watch?v=eK_JJUVGwIo

https://www.youtube.com/watch?v=pdZDazUj-xs