శ్రీనాధుడు నా పేరు, పూర్తి పేరు శ్రీనాధపద్మచరణ్
సింహాచలం లో శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబం లో పుట్టా
నాన్నగారు శ్రీమాన్ తిరుమల పల్లెర్లమూడి రాఘవాచారి గారు సింహాచలం దేవస్థానం సంసృతోనన్నతపాఠశాలలొ ప్రదానోపాద్యులుగా పనిచేసి ప్రస్తుతం ఉభయ వేదాంతాల మీదా రచనావ్యాసంగం చేస్తున్నారు, అమ్మ కుముదవల్లి (అబ్బా భలే పేరు పెట్టారు తాత గారు శ్రీమాన్ కరి రామానుజాచార్యులు గారు) కమ్మని రుచులని మాకందించే శాంతస్వరుపగ్రుహిణి, అక్క కృష్ణప్రియ తెలుగు గ్రేడ్ వన్ పండితురాలు విశాఖపట్నం జిల్లాలో, బావ శ్రీనివాస్ మన రాష్ట్రభాష ఉపాద్యాయులు కృష్ణా జిల్లాలో, అన్నయ్య రాజీవ లోచన్ సింహాచలం శ్రీవరాహ నృసింహ స్వామి సన్నిధిలో అర్చకులు, అమ్మలాగే వదినగారు రమాదేవి , ఇక నా భార్య శారద కృష్ణ మా ఎనిమిది సంవత్సరాల సాంసారిక జీవితంలో ఎత్తు పల్లాలు కలిసి చూసి అనుభవిస్తున్న సద్గృహిని.
నేను ప్రస్తుతం మారియట్ అనే ఒక అమెరికా దేశ హోటల్ మేనేజిమెంట్ కంపనీ లో డైరెక్టర్ అఫ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాహైదరాబాద్ లో, రచనా వ్యాసంగం మీద మక్కువ కొద్ది అప్పుడప్పుడు రాసుకున్న విషయాలు ఇక్కడ ఉంచాలని ప్రయత్నం.
ఎక్కడైనా తప్పులు రాస్తే పెద్దలు చెప్పగలరు, పెద్దలే చెప్పాలని లేదు తప్పుని ఎవరైనా చెప్పచ్చుకదా.
జై శ్రీమన్నారాయణ
ఇక్కడ నేను రాసుకున్న కొన్ని కవితలు, వ్యాసాలు ఉంటాయి, నాకు స్ఫూర్తి మా పెద్దనాన్నగారి (శ్రీమాన్ రామచంద్రాచార్యులు గారు) అబ్బాయి కులశేఖర్, అన్నా నువ్వు త్వరగా కోలుకోవాలి మళ్ళి నీ పాటలు చూడాలి వినాలి.
No comments:
Post a Comment