Friday, February 27, 2015

ప్రేమ తీరు

ప్రేమ తీరు 

తమిళంలో మేస్ట్రో ఇళయరాజా మెల్ల తిరంతతు కధవు అనే సినిమా కోసం జానకి అమ్మ చేత పాడించిన ఒరుసనం తూన్గిరిచి అనే ట్యూన్ కి రాసాను




ఎ మానసా నీకెందుకే ఉసులాడే ఈ తొందరా
పాడు ఈడు మీద కొచ్చి వయసుకొచ్చే ఈ తొందరా

కనుల కలలను, మనసు ఉరకలను
ఎలా  చెప్పి ఆపాలి
కలల అలలను, ఉరుకు పరుగులను
ఎం చెప్పి దాచాలి! ఎలా తట్టుకోవాలి
ఎంత చెప్పినా ! ఎలా చెప్పినా
మాట మార్చవే, మౌన గీతికా...... మౌన గీతికా
వద్దన్నానే, విన్నన్ననేవే, నీకు భావ్యం కాదు ఇలా
తప్పన్నాన్నే ఒప్పన్నావే, అసలు ఏంటో నీ తీరే   " ఎ మనసా నీ కేందుకే  "

వలపు వరదలను, తనువు తహతహలు
ఎలా చెప్పి నిలపాలే
తలపు తలుపులను ఉసురు ఊసులను
ఎం చెప్పి ఉంచాలి ఎలా ఆపుతుండాలి
ఎంత చెప్పినా! ఎలా చెప్పినా
మాట మార్చవే, మౌన గీతికా...... మౌన గీతికా
మాయన్ననే కాదన్నవే మంత్రమేదో వేసావే
మత్తన్ననే ప్రేమన్నావే అసలు ప్రేమే ఈ తీరా !   " ఎ మనసా నీ కేందుకే  "

No comments:

Post a Comment