Sunday, April 12, 2015

manasa veena madhu geetam

మిత్రులకు శుభోదయం

కన్నడ దేశ ద్వయం గురించి వినే ఉంటారు వారు రాజెన్-నాగేంద్ర అని, ఎన్ని అద్భుతమైన పాటలు తెలుగు చిత్ర సీమకి వారు ఇచ్చారో మచ్చుకకి పంతులమ్మ (నా అల్ టైం ఫేవరేట్) చిత్రం లోని ఈ వేటూరి గారి పాట చూడండి. బాలు మనవాడుగా పుట్టడం మన అదృష్టం, సుశీలమ్మ గారు మనకి వరం.
ఈ పాట హమ్ చేసేవారిని చాలామందిని చూసా, జనరల్ గా కొన్ని తప్పులు పాడతారు, ఉదాహరణకు ములకింతలకే పూచిన కొమ్మ అని పాడతారు అది కొమ్మ కాదు " పొన్న " అది వేటూరి వారి గొప్పతనం. అలాగే మమతెై కడ చేరగలను అని పాడతారు అది "కడ తేరగలను ".


ఆ.... మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం…
సాగరమధనం అమృత మధనం సంగమ సరిగమ స్వర పారిజాతం…
మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సంసారం.. సంగీతం…

ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన  హృదయ పరాగం… ||2||
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడేకోయిల గీతం…
శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమంచు నీ అందమే… విరిసింది  అరవందమై కురిసింది  మకరందమే… || మానస వీణ ||

జాబిలి కన్నా.. నా చెలి మిన్నా ములకింతలకే పూచిన పొన్న …
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేన్నవ్వగలను …
పాల కడలిలా  వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది…
ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతెై కడ తేరగలను… || మానస వీణ ||

కురిసేదాక అనుకోలేదు శ్రావణ  మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని…
కలిసేదాక అనుకోలేదు తీయని  స్నేహమని
పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని… || మానస వీణ||

No comments:

Post a Comment