Friday, October 15, 2021

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

 

జై శ్రీమన్నారాయణ

సంగీతం మరియు గానం : శ్రీమాన్ బాలక్రిష్ణ ప్రసాద్ గారు

రాగం : కాపి

తాళం : తిశ్రగతి ఎక తాళం

కీ : బి మేజర్


శ్రావణ బహుళాష్టమి రోజున అర్ధరాత్రి వేళ చతుర్బుజాలుశంఖ చక్రాలుకిరీటము మొదలగు అభరణాలు ధరించి దేవకినందునికి  శ్రీ కృష్ణుడు ఉదయించాడుబ్రహ్మదేవుడుపరమేశ్వరుడు వచ్చి వాకిట నిలిచి శ్రీ కృష్ణుడిని స్తుతిస్తున్నారటఅట్టి శ్రీ కృష్ణుని  మహిమలను ఎట్లా కొనియాడేది శ్రీకృష్ణుడే అలమేల్మంగతో కూడి వేంకటాద్రి దేవుడైనాడుఅని అన్నమయ్య కృష్ణ గానం చేస్తున్నాడు.

 

సతులాలా ఓ ఓ 

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు 

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు



పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు

అట్టె కిరీటము ఆభరణాలు ధరించి

యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

అట్టె కిరీటము ఆభరణాలు ధరించి

యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

 


 

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను

యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను

యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు

ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

 

 

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదివో  తా బిడ్డాడాయె నీకృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదివో  తా బిడ్డాడాయె నీకృష్ణుడు

అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ(గూడి

యెదుటనే ఉన్నాడు  డీకృష్ణుడు

 అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ(గూడి

యెదుటనే ఉన్నాడు  డీకృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు



No comments:

Post a Comment