Friday, June 10, 2016

మిత్రులకి శుభోదయం

చాలా పాటలు మిత్రులకి గుర్తుచేస్తున్నాం ఈ పేజీ ద్వారా, కాని మొదటిసారి బోలెడన్ని పాటలు ఒకేసారి వినిపించాలనిపించింది, ఉదయం ముఖపుస్తం  తెరిచి చూస్తే శ్రీమాన్ రామజోగయ్య శాస్త్రి గారు సౌజన్య-సౌమ్య అనే ద్వయం పాడిన పాత పాటల మాలిక పెట్టారు. అబ్బా మెట్రోలో వస్తూ చెవిలో ఇయర్ ఫోన్స పెట్టుకుని ప్రపంచాన్ని మరిచిపోయా, విజయావారి చందమామ అంత చల్లగా, ANR గారి అంత handsome గా, సావిత్రి గారి అంత అందంగా, కృష్ణశాస్త్రి గారి కవితలా ఆహా ఎంత ఆనంద పడ్డానో. మీరు ఆనందిస్తారని పెడుతున్నా.



https://www.youtube.com/watch?v=uISfXNH2lww&spfreload=5

Friday, June 3, 2016

పుచ్చా పువ్వుల విచ్చే తావుల

మిత్రులకి వందనం

మన గ్రూప్ లో ఒక మంచి గాయకులు ఉన్నారు వారు పార్ధసారధి, మొదటి తరం పాడుతాతీయగా నుంచి వారిని ఫాలో అవుతున్నా. చాలా మంచి పాటలు పాడారు వారు (చిరు గారి కోసం బంగారం తెచ్చి) వారు పాడిన, నాకు బాగా ఇష్టమైన పాట "పుచ్చా పువ్వుల విచ్చే తావుల" అని మనోహరం సినిమా లోనిది. వేటూరి వారి అందమైన పువ్వుల వర్షం కురిపిస్తే దానికి మణిశర్మ గారు పుప్పొడి రాగాలు అద్దారు. దానికి గుణశేఖర్ గారి రంగుల అద్దకం మరింత శోభని అందించింది. చిత్రమ్మ తో కలిసి నేమాని వారు పాడిన ఈ పాట మీకోసం ఈ రోజు.

తప్పులేమైనా ఉంటే మిత్రులు సరిదిద్దగలరు


పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు
పచ్చా మీగడలిచ్చే తియ్యన తెచ్చే నీ కలలు
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా
ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే  సంధ్యల్లో
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ
వచ్చినాయమ్మా విచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా కలువలు విచ్చినాయమ్మా


గువ్వ జంటలకు కువ కువ ఇటు కుర్ర గుండెలకు మెలకువ
వీణ మీటె  సెలయేరు చలి వేణు ఊదే  చిరుగాలి
కలువ కనులలోనా కలవరింతలాయే
చలువ తనువులోనా జలదరింతలాయే

ఓ ఓ ఓ ఓ

పిండి వెన్నెల వండి వార్చిన వెండీ  ఇసకల్లో
తెల్లా మబ్బుని  వెల్లా వేసిన పిల్ల కాలువల్లో
వచ్చినాయమ్మా వచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా అలజడులొచ్చినాయమ్మా

లేత పచ్చికల అణకువ నును లేత మచ్చికల తొణకవ
నిండు అల్లికల నవ నవ తలదిండు మల్లికల శివ శివ
పట్ట పగటి ఎండా పండు వెన్నెలాయే
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే

ఓ ఓ ఓ ఓ

ఊరా వాకిలి తీసే  తియ్యని దొరా వయసుల్లో
మాఘామాసపు మంచు బెబ్బులి పోంచే వేళల్లో
వచ్చినాయమ్మా గిచ్చినాయమ్మా
వచ్చినాయమ్మా వలపులు గిచ్చినాయమ్మా



https://www.youtube.com/watch?v=-rmIIVvXMB4

నిను చూసిన క్షణంలో

మిత్రులకి వందనం

బాలు గారు లేని తెలుగు సినిమా ని ఉహించుకోలేము కదా, అవును ఆయిన మన తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం. ఈ రోజు వారి  సప్తతి, అయ్యా మీకు ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా బోలెడన్ని పాటలు మాకోసం పాడాలని కోరుకుంటున్నా.

ఈ మధ్య వారు బలుపు అనే చిత్రం కోసం ఒక పాట పాడారు, నిను చూసిన క్షణంలో అనే సీతారామ శాస్త్రి గారి పాట. ఇప్పటివరకు నేను తమన్ చేసిన ఒక్క పాట కూడా మిత్రులకి పరిచయం చెయ్యలేదు, మొదటిసారి ఈ పాట సినిమా లో చూసి చాలా ఆశ్చర్య పడ్డా. తమన్ ఇల్లాంటి పాట కూడా చెయ్యగలరా అనిపించింది. సూపర్ మెలోడీ.

ఈ పాట మీద మక్కువ పెరగడానికి మరో కారణం విశాఖ అందాలతో పాటు, మా చందనాల వాడి కొండ, కైలాస నాధుడి అండా రెండు చూపించారు దర్శకులు.


నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చేయి జారిన మనస్సు ఏమైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరిచిన మనస్సు ఏమైందో

అలా హలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందో
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో
ఏమైందో ఏమైందో నువ్వు ఒక్కసారి చూడు ఏమైందో

నాకు నీ పరిచయం మరొక జన్మేనని నీతో
పైకేల చెప్పడం నమ్మనంటవో ఏమో
తెలియని ఆ నిజం నీకు ఏ నాటికొ
ఇన్నాళ్ళ నా ఏకాంత ఇంక  ముగిసిందనో
నీ రాకతో సరి కొత్త నడక మొదలయిందనొ


https://www.youtube.com/watch?v=zNpXBt8A2FI