Friday, October 15, 2021

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

 

జై శ్రీమన్నారాయణ

సంగీతం మరియు గానం : శ్రీమాన్ బాలక్రిష్ణ ప్రసాద్ గారు

రాగం : కాపి

తాళం : తిశ్రగతి ఎక తాళం

కీ : బి మేజర్


శ్రావణ బహుళాష్టమి రోజున అర్ధరాత్రి వేళ చతుర్బుజాలు, శంఖ చక్రాలు, కిరీటము మొదలగు అభరణాలు ధరించి దేవకినందునికి  శ్రీ కృష్ణుడు ఉదయించాడు. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు వచ్చి వాకిట నిలిచి శ్రీ కృష్ణుడిని స్తుతిస్తున్నారట! అట్టి శ్రీ కృష్ణుని  మహిమలను ఎట్లా కొనియాడేది! ఈ శ్రీకృష్ణుడే అలమేల్మంగతో కూడి వేంకటాద్రి దేవుడైనాడు. అని అన్నమయ్య కృష్ణ గానం చేస్తున్నాడు.

 

సతులాలా ఓ ఓ 

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు 

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు



పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు

యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు

అట్టె కిరీటము ఆభరణాలు ధరించి

యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

అట్టె కిరీటము ఆభరణాలు ధరించి

యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

 


 

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను

యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను

యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు

ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో

హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

 

 

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదివో  తా బిడ్డాడాయె నీకృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు

ఇదివో  తా బిడ్డాడాయె నీకృష్ణుడు

అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ(గూడి

యెదుటనే ఉన్నాడు  డీకృష్ణుడు

 అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ(గూడి

యెదుటనే ఉన్నాడు  డీకృష్ణుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

సతులాలా ఓ ఓ  

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు

కతలాయ నడురేయి కలిగె శ్రీకృషుడు



Sunday, September 19, 2021

ఏలరా... కృష్ణుఁడా


జై శ్రీమన్నారాయణ

సంగీతం : శ్రీమాన్ బాలక్రిష్ణ ప్రసాద్
గానం : శ్రీమతి బుల్లెమ్మ
రాగం : శుద్ధధన్యాసి
తాళం : తిస్రగతి ఎకతాళం
కీ : డి మైనర్
రేకు: 10-6
సంపుటము: 10-59
రచన : తాళ్లపాక చినతిరుమలాచార్య

ఏలరా...  కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

పగటూ మాఁటల వగరూ దోఁచఁగ
పగటూ మాఁటల వగరూ దోఁచఁగ

మగనాలిని నన్ను నగఁ జూచే వేరా

పగటూ మాఁటల నొగరూ దోఁచఁగ

మగనాలిని నన్ను నగఁ జూచే వేరా

ఏలరా...  కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

కొనబూ విటుఁడ నీ కనుచూపులనే 
కొనబూ విటుఁడ నీ కనుచూపులనే 

నా మనసూ కరఁగించఁ పెనఁగే వేరా

కొనబూ విటుఁడ నీ కనుచూపులనే 

నా మనసూ కరఁగించఁ పెనఁగే వేరా

ఏలరా...  కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా


కలికీచేఁతల వలపించి నను నిట్టె
కలికీచేఁతల వలపించి నను నిట్టె

కలసితి శ్రీవెంకటగిరినాథా 

కలికీచేఁతల వలపించి నను నిట్టె

కలసితి శ్రీవెంకటగిరినాథా

ఏలరా...  కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా

ఏలరా... కృష్ణుఁడా


Monday, October 5, 2020

ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు

 జై శ్రీమన్నారాయణ 

రాగం : రేవతి 

సంపుటి : 1, సంకీర్తన : 220 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 


ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు 

ఆడుకొన్నమాటలెల్ల నవి నిజాలా 


తొలుకారు మెఱుపులు తోచి పోవుగాక 

నెలకొని మింటి నవి నిలిచీనా 

పొలతులవలపులు పోలసిపోవుగాక 

కలకాలంబవి కడతేరీనా 


కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక 

మెలకువ చూడ నవి మెరసీనా 

అలివేణుల మేలు ఆసపాటేకాక 

తలపు వేంకటపతి తగిలీనా 


కాంతాకనకాదులు అనాదిగా జీవుణ్ణి మాయామోహితుణ్ణి చేసి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇవన్నీ అసత్యాలు! అశాశ్వతాలు! అదే విషయాన్నీ అన్నమయ్య ఈ పాటలో చక్కగా తెలియజేస్తుననాడు! మనం ప్రేమ, వలపు ఆత్మీయత, అనుకునే ఇవన్నీ నిజంగా నిజమైనవా? కాదు, ఎందుకంటే అనంత కాలగమనంలో ఎవరూ ఎవరినీ శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండరు. చనిపోయేటప్పుడు ఏకాకిగా పోవాల్సిందే! కాబట్టి మూన్నాళ్ళ ముచ్చట అయన ఈ భోలోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అంత వట్టి బూటకాలే కదా! తొలకరి మెరుపులు, ఉరుములు అలా వచ్చి ఒక్కసారిగా గర్జించి వెళ్లిపోతాయి తప్ప వాటివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు! అలాగే భామినులు వలపులు కూడా యవ్వనంలో మురిపించి సత్యాన్ని మరపించేవే తప్ప శాశ్వతాలు కావు! దూరం నుంచి చూస్తే ఎండమావులలో నీరు ఏరులై పారుతుంది కానీ దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకుందామనుకుంటే ప్రయోజనం శూన్యం! ఆ విధంగానే నెలతలపై మోహము ఆశకొల్పుతుంది కానీ శాశ్వతానందాన్ని అందివ్వదు! కలలో  కనిపించిన సంపద ఎలా మన చేతికి అందదో, అలాగే కాంతలపై మొహం వల్ల  మేలు చేతికి అందదు సరికదా, అది భగవంతునిపై తలుపును చేర్చనివ్వదు. 



శరణంటి మాతని సంబంధమునజేసి

 జై శ్రీమన్నారాయణ 

రాగం : లలిత 

సంపుటి 2, సంకీర్తన 24

రాసిన వారు : శ్రీ పెద్ద తిరుమలాచార్య 

పాడినవిధానము : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 


శరణంటి మాతని సంబంధమునజేసి 

మరిగించి మమునేలి మన్నించవే 


సకల వేదములు సంకీర్తనలు చేసి 

ప్రకటించి నినుపాడి పావనుడైన 

అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యులు 

వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ 


నారదాది సనక సనందనాదులవలె 

పేరుబడి నిన్నుపాడి పెద్దలైనట్టి 

ఆ రీతి తాళ్ళపాక అన్నమాచార్యుల 

చేరి ఏలినయట్టి శ్రీ వేంకటనిలయ 


సామవేద సామగాన సప్తస్వరములను 

బాముతో నీసతి నిన్ను పాడినయట్టి 

ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల 

వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ 


పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన ఇది, అన్నమయ్య వంశస్థులమై, ఆ మహనీయునితో గల అనుబంధంతో మిమ్ముల్ని శరణు కోరుతున్నాను స్వామీ! సకల వేదసారాన్ని సంకీర్తనలుగా మలచి, నారదసనక సనందనాదుల వలె నీపై సంకీర్తనలు పాడి, సామవేద సామగాన సప్తస్వరములను నీకంకితం చేసిన అన్నమయ్యను చూసైనా మమ్ముల్ని కరుణించు వేంకటనిలయా! అంటూ విన్నపం చేస్తున్నాడు పెద్దతిరుమలయ్య . 

చాటెద నిదియే సత్యము సుండో

 జై శ్రీమన్నారాయణ 

రాగం : శుద్థసావేరి 

సంపుటి 2, సంకీర్తన 164

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 



చాటెద నిదియే సత్యము సుండో 

చేటులే దితని సేవించినను 


హారినొల్లని వా రసురులు సుండో 

సురలీతని దాసులు సుండో 

పరమాత్ముడితడే ప్రాణము సుండో 

మరుగక మరచిన మరి లేదికను 


వేదరక్షకుడు విష్ణుడు సుండో 

సోదించె  శుకుడు అచ్చుగ సుండో 

ఆది బ్రహ్మగన్నాతడు సుండో 

ఏదెస వెదకిన ఇతడే ఘనుడు 


ఇహ పర మొసగను ఈతడే సుండో 

వహి నుతించె పార్వతి సుండో 

రహస్య మిదియే రహి శ్రీ వేంకట 

మహీధరంబున మనికై నిలిచె 


అన్నమయ్య శ్రీ వేంకటాద్రిని  అధిరోహించి తాను కనుగొన్న సత్యాన్ని లోకానికంతటికీ ఎలుగెత్తి చాటుతున్నాడు! రెండు చేతులతో మనలందర్ని ఆ కొండపైకి ఆహ్వానిస్తూ ఇదిగో వినండి ఇదియే సత్యము కలియుగ రహస్యాన్ని మీ అందరికీ వెల్లడి చేస్తున్నాను, వేదరక్షకుడైన విష్ణుదేవుడు మనందరికీ ప్రాణాధారుడు ఇహపరాలను అనుగ్రహించేవాడు కలియుగంలో శ్రీ వేంకటాద్రిపై మనకు మనుగడగా  నిలిచి ఉన్నాడు కాబట్టి రండి ఆ దేవుని సేవించండి తరించండి అంటున్నాడు అన్నమయ్య ఆశ్రితజనపాలకుడు , సత్యస్వరూపుడైన శ్రీ వేంకటేశ్వరుణ్ని సేవించి తరిద్దాం 




Friday, September 25, 2020

శరణు వేడెద యజ్ఙసంభవ రామ

 జై శ్రీమన్నారాయణ 

రాగం : హంసానంది 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణప్రసాద్ గారు 

సంపుటి 3, సంకీర్తన 155


శరణు వేడెద యజ్ఙసంభవ రామ 

అరసి రక్షించు మమ్ము అయోధ్యరామ 


ధారుణిలో దశరధతనయ రామ 

చేరిన అహల్యను రక్షించిన రామ 

వారిధిబంధన కపివల్లభ రామ 

తారకబ్రహ్మమైన సీతాపతి రామ 


ఆదిత్య కులాంబుధి మృగాంక రామ! హర -

కోదండభంజనము చేకొనిన రామ 

వేదశాస్త్ర పురాణాది  వినుత రామ 

ఆదిగొన్న తాటకసంహార రామ 

 

రావణుని భంజించిన రాఘవ రామ 

వావిరి విభీషణవరద రామ 

సేవ నలమేల్మంగతో శ్రీ వేంకటేశుడవై 

ఈవల  దాసుల నెల్లా నేలినట్టి రామ 


        

Tuesday, September 22, 2020

శరణు శరణు నీకు జగదేక వందిత


జై శ్రీమన్నారాయణ 

సంపుటి 4, సంకీర్తన 276

రాగిరేకు 347

రాగం : ఛాయ 

పాడినవారు : గరిమెళ్ళ అనిలకుమార్ గారు. 


శరణు శరణు నీకు జగదేక వందిత 
కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన 

ఘన రణరంగ విక్రమ దశరథ పుత్ర
వినుతామరస్తోమ వీర రాఘవ 
మునులును ఋషులును ముదమునొందిరి నీవు 
జననమందినందుకు జానకీరమణ 

సులభ లక్ష్మనాగ్రజ సూర్యవంశతిలక 
జలధిబంధన విభీషణ వరద 
తలకి అసురులు పాతాళము చొచ్చిరి నీవు
విలువిద్య నేర్చితేనే విజయరామ

రావణాంతక  సర్వ రక్షక నిర్మల భక్త 
పావన దివ్యసాకేత పట్టణ వాస
వేవేలుగ నుతించిరి  వెస హనుమంతాదులు
సేవించిరి  నిన్నుచూచి శ్రీ వేంకటేశ